SHE Teams : పోకిరీలూ పారా హుషార్..! తాట తీసి దబిడి దిబిడి చేసేస్తున్నారు.!

ఆడవాళ్ల జోలికొస్తే తాట వొలుస్తామంటున్నాయి తెలంగాణ షీ టీమ్స్. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల..

SHE Teams : పోకిరీలూ పారా హుషార్..! తాట తీసి దబిడి దిబిడి చేసేస్తున్నారు.!
Eve Teasing
Follow us

|

Updated on: Jul 28, 2021 | 8:45 PM

SHE Teams – Telangana : ఆడవాళ్ల జోలికొస్తే తాట వొలుస్తామంటున్నాయి తెలంగాణ షీ టీమ్స్. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నమోదైన కేసులే ఇందుకు తార్కాణంగా కనిపిస్తోంది.

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.. ఆడవాళ్ల రక్షణ కోసం షీ టీమ్స్‌ని 2018లో ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఊపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేస్తోంది ఈ మహిళ రక్షణ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 331 టీమ్స్ పనిచేస్తున్నాయి.

షీ టీమ్స్ స్టార్ట్ అయిన కొత్తలో దాదాపు 5వేలకు పైగా కేసులు వచ్చేవి..కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతంలో మైనర్లు క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యేవారు. షీ టీమ్స్‌ ఇలాంటి కేసుల్లో పేరెంట్స్‌కి కౌన్సిలింగ్ ఇవ్వడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది తొలి 6 నెలల్లో మొత్తం 2800పైగా కేసులు వస్తే.. అందులో 1251మంది ఆకతాయిలు, పోకిరీలను అరెస్ట్ చేసింది షీ టీమ్స్ వ్యవస్థ. ఇందులో ఎక్కువగా 25 సంవత్సరాల వయస్సున్న యువకులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా తెలంగాణ విమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా పేర్కొన్నారు.

ఎవరైనా వేధిస్తే గతంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మహిళలు ముందుకొచ్చే వాళ్లు కాదని.. కాని ఆన్‌లైన్‌లో, వెబ్‌ సైట్ ద్వారా అవగాహన కల్పించడంతో ఫిర్యాదులు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి.. ఏదైనా సమస్య వస్తే వెంటనే మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి.. ఇప్పుడు మహిళలకు అండగా ఉంటుందని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు.

Read also : Srisailam dam : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. ఏడేళ్ల తర్వాత అద్భుతం