Ganja Seized: చేపల పెట్టెల్లో రూ.8 కోట్ల గంజాయ్.. ముఠా ఆటకట్టించిన పోలీసులు..
Ganja Seized in Kothagudem, Khammam: వాహనాల్లో గంజాయి తరలించడం.. కామన్.. ఇలాంటి సందర్భాల్లో నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏవేవో ప్లాన్‌లు వేస్తుంటారు. అయినా కానీ పోలీసులు
Ganja Seized in Kothagudem, Khammam: వాహనాల్లో గంజాయి తరలించడం.. కామన్.. ఇలాంటి సందర్భాల్లో నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏవేవో ప్లాన్‌లు వేస్తుంటారు. అయినా కానీ పోలీసులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా నిందితుల ఆటకట్టిస్తుంటారు. తాజాగా ఓ ముఠా చెపల పెట్టెల్లో గంజాయ్ నింపుకుని.. తరలిస్తుండంగా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు చకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో కలిపి మొత్తం రూ.8 కోట్లకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడంచారు. రెండు చోట్ల కలిపి 4,483 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా పరిధిలో రూ.7.30 కోట్లు, ఖమ్మం పరిధిలో రూ.1.98 కోట్లు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భద్రాద్రి జిల్లా చుంచుపల్లి పరిధిలోని విద్యానగర్‌లో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన రెండు లారీలను పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. రెండు లారీల్లోనూ చేపల పెట్టెల్లో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు లారీల్లో కలిపి మొత్తంగా 3,653 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు లారీలను స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అనంతరం చుంచుపల్లి ఎస్‌ఐ మహేష్, సిబ్బందిని అభినందించారు. చింతూరు నుంచి హైదరాబాద్ మీదుగా హరియాణాకు గంజాయి తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఖమ్మం సీపీ విష్ణు వారియర్ వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఖమ్మం రూరల్ పరిధిలోనూ బుధవారం రూ.1.98 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read: