Father Murder: కంటికి రెప్పలా పెంచిన కూతురే కడతేర్చింది.. ప్రేమ పెళ్లి వద్దన్నందుకు తండ్రిని రాడ్‌తో కొట్టి.. కిరాతకంగా

Girl gets Father Murder: తన ఇంట కూతురు పుట్టిందని ఆ తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు. తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కంటికి

Father Murder: కంటికి రెప్పలా పెంచిన కూతురే కడతేర్చింది.. ప్రేమ పెళ్లి వద్దన్నందుకు తండ్రిని రాడ్‌తో కొట్టి.. కిరాతకంగా
girl gets father killed
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 28, 2021 | 7:48 PM

Girl gets Father Murder: తన ఇంట కూతురు పుట్టిందని ఆ తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు. తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేయాలనుకున్నాడు. అలాంటి తండ్రినే.. ఓ యువతి ప్రియువు మోజులో పడి కడతేర్చింది. ప్రేమ పెళ్లికి తండ్రి ఒప్పుకోలేదని.. కన్నతండ్రినే ఆ యువతి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంభల్ జిల్లాలోని ముతైన్ గ్రామానికి చెందిన హ‌ర్పాల్ సింగ్‌ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె గత కొద్ది కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే ప్రియుడిని వివాహం చేసుకుంటాని తన తండ్రికి చెప్పగా.. హ‌ర్పాల్ సింగ్‌ నిరాక‌రించాడు. ఈ క్రమంలో హర్పాల్ సింగ్ జులై 19న గ్రామంలోని పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో యువతి, తన ప్రియుడితో కలిసి హర్పాల్ సింగ్‌ను ఇనుప రాడ్‌తో కొట్టి చంపింది. అనంతరం అక్కడున్న చెట్టుకు ఉరి వేశారు. ఆ తరువాత హర్పాల్ సింగ్ మృతదేహం పొలంలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించగా.. ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అందరూ భావించారు.

దీంతో కుటుంబ స‌భ్యులు సైతం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించగా.. సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బాధితుడి త‌ల‌పై ఇనుప‌రాడ్‌తో కొట్టడంతోనే ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంద‌ని పోలీసులు తెలిపారు.

అనంతరం అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా.. ఈ ఘాతుకానికి పాల్పడింది కూతురు, తన ప్రియుడు అని తేలిందన్నారు. పరారైన యువతిని, ఆమె ప్రియుడును బ‌దౌన్ జిల్లా ఇస్లాంన‌గ‌ర్‌లో అరెస్ట్ చేశామ‌ని సంభాల్ ఎస్పీ చ‌క్రేష్ మిశ్రా బుధవారం వెల్లడించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Also Read:

Cyber Crime: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తికే టోకరా పెట్టేశారు..

Astronomer: టాలెంట్ అంటే ఈ చిన్నారిదే.. 7 గ్రహశకలాలను కనిపెట్టి.. చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలిక..