Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

Venkata Narayana

Venkata Narayana | Edited By: Ravi Kiran

Updated on: Jul 28, 2021 | 6:17 PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను

Devineni Uma : మాజీ మంత్రి దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు
Devineni Uma

Devineni Umamaheswararao : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. నిన్న రాత్రి జి కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నడిచి చివరికి అది దేవినేని ఉమ అరెస్టుకు దారితీసిన సంగతి తెలిసిందే. కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని వెళ్లి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి వస్తున్న దేవినేని ఉమ కారు పై దాడి జరిగింది.

ఈ దాడి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అనుచరుల పనేనని టిడిపి ఆరోపించింది. ఈ నేపథ్యంలో జి కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ, టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కారు లాక్ చేసుకొని ఆందోళన చేస్తున్న దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులోనే దేవినేని ఉమ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమను ఇవాళ కోర్టు ఎదుట హాజరుపర్చగా న్యాయమూర్తి దేవినేని ఉమకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు.

ఇలా ఉండగా, దేవినేని ఉమ అరెస్టు అంశం మీద పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడని నాని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని బీజేపీకి అప్పజెప్పి సింగపూర్, మలేషియా పరిపోతాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి టీడీపీ నాయకులు అల్లర్లు చేయాలని చూస్తే సహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. “వాళ్ళు చేసిన తప్పులను, వెన్నుపోటులను పక్క వాళ్లపై నెట్టడం వాళ్ళకి అలవాటు. ఎన్టీఆర్‌ని చెప్పులతో కొట్టింది వాళ్లే.. మళ్లీ ఆయనని పూజిచేది వాళ్లే.. ఆయన పేరు చెప్పి ఓట్లు అడుక్కునేది వాళ్లే. ” అని నాని ఎద్దేవా చేశారు.

దేవినేని ఉమ అరెస్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే, అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా మహేశ్వరరావు అని నాని అన్నారు. “దేవినేని ఉమ ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్టు అబూత కల్పనలు చేస్తుంటాడు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడు. మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారు. దాడి చేయడమే కాకుండా దళితులను దుర్బాషలాడారు. పోలీసులను కూడా బెదిరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు” అని నాని ఆరోపించారు.

“అక్కడ (మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతం) అక్రమంగా మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. దీంట్లో ఉమ హయాంలో అక్కడ ఎంత మైనింగ్ జరిగిందో మార్క్ చేస్తున్నాం. అత్యంత ఎక్కువ మైనింగ్ ఆయన హయాంలోనే జరిగింది. అక్కడి కాంట్రాక్టర్లును డబ్బుల కోసం బెదిరించాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అని బెదిరించి ఆపించాడు. ఆ తర్వాత మళ్లీ దాన్ని రెవెన్యూ ల్యాండ్ గా మార్పించింది ఉమానే.” అని కొడాలి నాని తీవ్రస్థాయిలో ఎదురు దాడికి దిగారు. రైతుల కష్టాన్ని దోచుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పిన మంత్రి, ఇలాంటి చంద్రబాబు, ఉమ లాంటి వారి మాటలు రైతులు నమ్మొద్దని కోరారు.

ఇలా ఉండగా, మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ అరెస్టును ఖండిస్తూ నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఉమను విడుదల చేయాలంటూ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. దేవినేని ఉమను చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

Read also : TTD : రూ. 300 దర్శన టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ.. రోజుకు 3 వేల టిక్కెట్లు. ఇలా బుక్ చేసుకోండి..

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu