Vijayawada: ప్రేమ పేరుతో ట్రాప్.. ఏపీ నుంచి యూపీకి తీసుకెళ్లి అత్యాచారం.. ఆపై దారుణంగా..
Woman murdered by lover in Vijayawada: ప్రేమ వలలో పడి విజయవాడలో మరో యువతి హత్యకు గురైంది. ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఆ కసాయి మాటలను
Woman murdered by lover in Vijayawada: ప్రేమ వలలో పడి విజయవాడలో మరో యువతి హత్యకు గురైంది. ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఆ కసాయి మాటలను ఆ యువతి.. నిజమనుకుంది. తీరా అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ కిరాతకుడు తన వెంట రెండు వేల కిలోమీటర్లు వచ్చిన యువతి బంగారంపై కన్నేశాడు. చివరకు అత్యాచారం చేసి.. నగలు దొచుకుని.. నదిలోకి తోసేసి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాగా.. యువతిది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడ నగరం.
వివరాలు.. విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో ఓ యువతి(21) కుటుంబంతో కలిసి నివాసముండేది. అయితే ఆ యువతిపై కన్నేసిన యువకుడు ప్రేమ పేరిట వెంటపడ్డాడు. యువతిని నమ్మించి తన వలలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 10వ తేదీన యువతి ఇంట్లోంచి ఆ కిరాతకుడి వెంట వెళ్లింది. అయితే యువతికోసం అంతటా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో.. తల్లిదండ్రులు విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే తన కూతురిని ఎత్తుకెళ్లిన యువకుడు ఉన్నట్లు తెలుసుకున్న యువతి తండ్రి.. స్నేహితులతో కలిసి పట్టుకోడానికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్ లోని సహరంపూర్ ప్రాంతంలో యువకుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే.. పోలీసుల విచారణలో సదరు యువకుడు యువతిని నదిలో తోసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. యువతికి సంబంధించిన బంగారం కూడా అతని వద్దే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: