Silver Seized: పోలీసుల తనిఖీలు.. అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల వెండి వస్తువులు స్వాధీనం
Silver Ornaments Seized: పన్నులు ఎగ్గొట్టడంలో, అక్రమంగా వ్యాపారం చేయడంలో కొంతమంది ఉపయోగించే తెలివితేటలు చూస్తుంటే వారు చేసే పనిని పట్టించుకోకుండా..
Silver Ornaments Seized: పన్నులు ఎగ్గొట్టడంలో, అక్రమంగా వ్యాపారం చేయడంలో కొంతమంది ఉపయోగించే తెలివితేటలు చూస్తుంటే వారు చేసే పనిని పట్టించుకోకుండా అద్భుతం అనిపించకమానదు. ఎందుకంటే తాము చేసే అక్రమ పనిని జిల్లాలు రాష్ట్రాలు దాటిస్తున్న సమయంలో ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటారేమో అనే భయం కూడా లేకుండా వారు చేస్తున్న పనికి షాక్ తినాల్సిందే..తాజాగా కారులో భారీగా అక్రమంగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసుల వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి సామానులను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి తెలంగాణలోకి వరంగల్ పట్టణానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం వెండి 22 కేజీలు ఉంటుందని .. ఈ వెండి సామాన్లకు ఎటువంటి బిల్లులు లేవని చెప్పారు. దీంతో కారుతో సహా వెండిని సీజ్ చేశారు. అక్రమంగా వెండిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులువ్యక్తిని కమర్షియల్ టాక్స్ అధికారులకు అప్పగించారు. వెండి విలువు సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Also Read: Traffic Challan: ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే హెల్మెట్ లేని వారికి భారీ బాదుడు.. ఆరునెల్లలో రూ. 86 కోట్లు వసూలు..
ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్