Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Challan: ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే హెల్మెట్ లేని వారికి భారీ బాదుడు.. ఆరునెల్లలో రూ. 86 కోట్లు వసూలు..

Hyderabad TrafficChallan: ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో టాప్ టెన్ దేశాల్లో భారత దేశం కూడా ఒకటి.. ఈ రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోతున్న..

Traffic Challan: ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే హెల్మెట్ లేని వారికి భారీ బాదుడు.. ఆరునెల్లలో రూ. 86 కోట్లు వసూలు..
Hyd Taffic Police
Follow us
Surya Kala

|

Updated on: Jul 28, 2021 | 4:35 PM

Hyderabad TrafficChallan: ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో టాప్ టెన్ దేశాల్లో భారత దేశం కూడా ఒకటి.. ఈ రోడ్డు ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోతున్నవారితో పాటు శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్న్ ధరించడం తప్పని చేశాయి ప్రభుత్వాలు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపేవారిని కెమెరాలు వెంటండుతూనే ఉన్నాయి. ఎవరైనా ట్రిఫిక్ రూల్స్ ,పాటించకుండా మోటార్ సైకిల్ తో రోడెక్కితో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తమ కెమెరాలతో క్లిక్ మనిపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా .. హెల్మెట్ లేకుండా బండిని నడిపే వాహనదారులకు చలానా రూపంలో వడ్డిస్తున్నారు. దీంతో ఏటా లక్షల్లో చలానాలు, కోట్లలో జరిమానాలు విధిస్తున్నారు

ఒక్క జీహెచ్ఎంసి పరిధిలోనే గత ఆరునెలల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహదారులపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇక జరిమానా, చలనాలతో ఖజానాలో కాసుల వర్షం కురుస్తుంది. ఇక గత నెల రోజుల నుంచి హైదరాబాద్ పోలీసులు పెండింగ్‌‌ ట్రాఫిక్ ఫైన్లు వసూలు చేసేందుకు స్పెషల్‌‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లాక్‌‌డౌన్ కేసులతో పాటు ట్రాఫిక్ రూల్స్‌‌ బ్రేక్ చేసిన వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. రోజూ ట్రాఫిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ ముగిసిన అనంతరం ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ బైక్స్ ను చేసి.. బైక్స్, కార్లు, హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌పై పెండింగ్‌‌ చలానాలు వసూలు చేస్తున్నారు. చలానాలు చెల్లించని వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది నమోదైన కేసుల్లో సుమారు 45 శాతం పెండింగ్ చలాన్స్‌‌ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ ఆరు నెలల్లోనే 63.47 లక్షల కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.85.77 కోట్ల జరిమానాలు జనరేట్ అయ్యాయి. ఇక సర్ చార్జీల మోత కూడా వాహనదారులకె వడ్డిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలతో ఫొటోలు తీస్తే.. రూ.100తోపాటు నాన్‌‌ కాంటాక్ట్‌‌ కేసుల కింద రూ.35 సర్వీస్ చార్జ్‌‌ తప్పనిసరి చేశారు. దీంతో మొత్తం రూ.135 చలానా విధిస్తున్నారు. పోలీసులు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌‌లో స్పాట్ చలానాలు విధిస్తున్నారు. అక్కడ రూ.100 వసూలు చేస్తున్నారు. రూ.35 లెక్కన -సర్వీస్ చార్జీలే రూ.22.21 కోట్ల వరకూ ఉన్నట్లు పోలీస్ శాఖల లెక్కల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు.. వెనుక కూర్చున్న వ్యక్తికీ కూడా హెల్మెట్ తప్పని సరిచేశారు. ఈ మేరకు పోలీసులు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు.. వెనుక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ లేనియెడల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.. భారీగా ఫైన్ కూడా విధిస్తున్నారు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా టార్గెట్ లు ఇస్తున్నారు. దీంతో నగరంలో బైక్ పై వెళ్తున్న వాహనదారులు ఏ మాత్రం రూల్స్ అతిక్రమించినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోలీసులు పోటీ పడిమరీ ఫోటోలు తీస్తున్నారు.. చలానాలు విధిస్తున్నారు.

Also Read:   ఎయిర్ టెల్ కస్టమర్స్‌కు షాక్. రేపటి నుంచి పెరగనున్న కనీస ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్