Hyderabad: హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌పై హోంమంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు..
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కుటుంబ సమస్యలతో చాలా మంది..
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కుటుంబ సమస్యలతో చాలా మంది మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారని, అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం భరోసా సెంటర్స్ పని చేస్తాయని మంత్రి మహమూద్ అలీ తెలిపారు. బుధవారం నాడు సరూర్‌నగర్ పరిధిలోని భగత్ సింగ్ నగర్‌లో భరోసా సెంటర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి.. పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపిపంచారు. సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందన్నారు. సిటీలో 60 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతోనే క్రైమ్ కంట్రోల్‌లో ఉందన్నారు. ఇదే సమయంలో కరోనా కట్టడిలో పోలీసుల పనితీరును కొనియాడారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అరికట్టడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు.
మహిళల భద్రత మనందరి బాధ్యత.. ప్రజల అవసరాల కోసమే ఈ భరోసా సెంటర్‌కు శంకుస్థాపన చేశామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. భరోసా సెంటర్స్‌తో ప్రజలకు మరింత భద్రత పెరుగుతుందన్నారు. మహిళల భద్రత.. మన అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయని డీజీపీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని, కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టుతో క్రైమ్‌ను కంట్రోల్ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ భరోసా సెంటర్స్‌తో బాధిత మహిళలకు, యువతులకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా, కోటి 75 లక్షల రూపాయలతో ఈ భరోసా సెంటర్‌ను నిర్మిస్తున్నామని రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళల సేఫ్టీ సెక్యూరిటీలో ఈ భరోసా సెంటర్స్ కీలకంగా పని చేస్తున్నాయని చెప్పారు.
Also read:
AP CM YS Jagan: కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష.. ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు..!
పాకిస్తాన్ లోని కరాచీలో ఇద్దరు చైనీయులపై కాల్పులు.. బైక్ పై దుండగుల పరారీ