Raj Kundra Case: రాజ్ కుంద్రాకు బెయిల్ తిరస్కరించిన ముంబై కోర్టు.. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విన్నపానికి అంగీకారం..
పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు బెయిలును ముంబై కోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్ ని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధీర్ భాజీపాలే తోసిపుచ్చారు.
పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు బెయిలును ముంబై కోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్ ని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధీర్ భాజీపాలే తోసిపుచ్చారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతోందని, కుంద్రాకు బెయిల్ మంజూరు చేయరాదని, చేసిన పక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కిరణ్ బిద్వే కోర్టుకు తేలిపారు.. పైగా కొంతమంది బాధితుల వాంగ్మూలాలను తాము సేకరించవలసి ఉందని ఆయన చెప్పారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే తాను ఈ కేసులో పూర్తిగా సహకరిస్తున్నానని, అందువల్ల తనను ఇక పోలీసు కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని రాజ్ కుంద్రా పేర్కొన్నాడు. ఈ కేసులో గరిష్ట శిక్ష ఏడేళ్ళని, అందువల్ల పోలీసు కస్టడీలో తాను కొనసాగడంలో అర్థం లేదని తన పిటిషన్ లో అన్నాడు. పైగా తన క్లయింటు..ఆయన కుటుంబం, ఇల్లు ముంబైలోనే ఉన్నారని అందువల్ల ఇన్వెస్టిగేషన్ కి ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాడని ఆయన తరఫు లాయర్ అన్నాడు.
కాగా కుంద్రా బ్రిటిషర్ అని ఆయన ఎప్పుడైనా ఈ దేశం వదిలి పారిపోవచ్చునని పోలీసులు అన్నారు. అయితే ఆయన పాస్ పోర్టు అప్పుడే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తరఫు అడ్వొకేట్ పేర్కొన్నాడు. కాగా ఈ కేసులో కొంతమంది బాధితులు తమను కుంద్రా కంపెనీ ఉద్యోగులు ఎలా టార్చర్ పెట్టింది బయట మీడియాకు విన్నవించారు.
అటు-రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి చాలామంది బాధితులు ముందుకు వస్తున్నారని, ఈ నిందితునికి బెయిల్ ఇచ్చిన పక్షంలో వారు భయపడి రాకపోవచ్చునని ఇన్వెస్టిగేటింగ్ అధికారి అన్నారు. పైగా ఫైనాన్షియల్ ఆడిట్ కూడా ఇంకా పూర్తి కావలసి ఉందన్నారు. బెయిల్ పై ఉన్న కొంతమంది నిందితులు ఇతర నిందితులను కూడా తప్పించడానికి యత్నించవచ్చునన్నారు. ఈ కేసులో మరో నిందితుడైన ర్యాన్ ఖోర్పే ఐటీ నిపుణుడిని, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను అతడు నాశనం చేయవచ్చునని కూడా ఆయన అన్నారు. ఇందుకు కుంద్రా తరఫు లాయర్ పాండా..తన క్లయింటు టెర్రరిస్టా అని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చూసేందుకు తన క్లయింటు ఎవరినైనా ఆపాడా అని కూడా ఆయన అన్నాడు. ఏమైనా… ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ ఈ కేసులో కుంద్రాకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Dasyam Vijayabhaskar : రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ కు జైలు శిక్ష.. పూర్తి వివరాలు