గంటలో పెళ్లి.. ఇంతలో పోలీసులు ఎంట్రీ.. ఎగిరి గంతేసిన వధువు.. అసలేం జరిగిందంటే?

Viral News: ఇంకో గంటలో పెళ్లి. వధువు మెడలో మూడుముళ్లు పడతాయనుకున్న సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది పెళ్లి కాస్తా క్యాన్సిల్ అయింది..

గంటలో పెళ్లి.. ఇంతలో పోలీసులు ఎంట్రీ.. ఎగిరి గంతేసిన వధువు.. అసలేం జరిగిందంటే?
Marriage
Follow us

|

Updated on: Jul 28, 2021 | 6:47 PM

ఇంకో గంటలో పెళ్లి. వధువు మెడలో మూడుముళ్లు పడతాయనుకున్న సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది పెళ్లి కాస్తా క్యాన్సిల్ అయింది. దీనితో వధువు ఎగిరి గంతేసింది. ఇదేందిది.. ఇదెక్కడా.. చూడలేదని అనుకుంటున్నారా.! అయితే అసలు స్టోరీ ఏంటంటే..

తమిళనాడులోని చెన్నై పుజల్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల జనతుల్లా ఫిర్డోస్ అనే యువతికి.. ఆమె కుటుంబసభ్యులు ఇష్టం లేని పెళ్లిని నిశ్చయించారు. తనని బలవంతంగా మేనమామకు ఇచ్చి కట్టబెట్టేందుకు పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. వధువు, వరుడు మండపానికి చేరుకున్నారు. వధువుకు ఏం చేయాలో తెలియలేదు. పెళ్లిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ వీడియోను రూపొందించి తన స్నేహితులకు పంపించింది. దాన్ని పోలీసులకు ఫార్వర్డ్ చేయాలని సూచించింది.

”నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టంలేదు. బలవంతంగా మేనమామకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. అతడికి వేరే మహిళలతో సంబంధం ఉంది. ఈ పెళ్లి జరిగితే నా జీవితం నాశనం అవుతుంది. ఒకవేళ పెళ్లి జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని యువతి వీడియోలో పేర్కొంది.

సదరు వీడియోను యువతి స్నేహితులు మహిళా పోలీసులకు చేరవేయడంతో.. వాళ్లు మండపంలోకి రంగప్రవేశం చేసి పెళ్లిని ఆపేశారు. వధువు తల్లిదండ్రులు, వరుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా, పెళ్లి విషయంపై మరోసారి కుటుంబసభ్యులు ఒత్తిడి తీసుకొస్తే తమను సంప్రదించాలంటూ పోలీసులు వధువుకు చెప్పారు.

Also Read:

దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..

ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!