- Telugu News Photo Gallery Viral photos Most wealthiest treasures in india which make you billionaires overnight in india
Viral Pics: దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..
Most Wealthiest Treasures: భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలయం. దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఎనలేని సంపద దాగి ఉందని అంటుంటారు. పురాతన దేవాలయాలు, శిధిలావస్థలో..
Updated on: Jul 27, 2021 | 7:29 PM

భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలయం. దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఎనలేని సంపద దాగి ఉందని అంటుంటారు. పురాతన దేవాలయాలు, శిధిలావస్థలో ఉన్న కోటల్లో లెక్కలేనన్ని నిధులు, నిక్షేపాలు దాగున్నాయని కొంతమంది పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయపడుతుంటారు. ఇండియాలో ఉన్న అలాంటి ఐదు ప్రదేశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

బీహార్‌లోని సోన్ భండార్ గుహలు: ఇక్కడ బంగారు నిక్షేపం ఉందని పేరే సూచిస్తుంది. ఇవి బీహార్‌లోని రాజ్‌గీర్ ప్రాంతంలో ఉన్న రెండు గుహలు. ఇక్కడే గౌతమ్ బుద్ధుడు మగధ రాజ్యంలోని బింబిసారాకు బోధించాడని సమాచారం. ఈ రెండు గుహలలో బోలెడంత బంగారాన్ని దాచి ఉంచారని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ నిధికి సంబంధించిన రహస్య తలుపు అత్యంత సురక్షితమైన రీతిలో నిర్మించబడిందని అంటుంటారు. ఇక ఈ గుహలో చెక్కబడిన లిపిని మీరు అర్థం చేసుకోగలిగితే, నిధికి చెందిన రహస్యపు తలుపును తెరవగలరు.

కేరళలోని పద్మనాభస్వామి ఆలయం: తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం భారతదేశంలో అతిపెద్ద ఆలయాలలో ఒకటి అని అనడంలో సందేహం లేదు. ఇక్కడ ఉండే సంపద చాలామంది బిలియనీర్ల ఆస్తుల కంటే ఎక్కువ అని అంటారు. 2011లో, కోర్టు ఆదేశం మేరకు ఈ ఆలయం నేలమాళిగను తెరిచారు. అందులో ఆభరణాలు, శిల్పాలు, కిరీటాలు, బంగారు వస్తువులు, విలువైన రత్నాలు కనిపించడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ నేలమాళిగలోని వస్తువుల మొత్తం విలువ 22 బిలియన్లు, అంటే సుమారు 1.3 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అటు సుప్రీంకోర్టు రెండవ నేలమాళిగను కూడా తెరవాలని ఆదేశించింది, అయితే ఆ ఆలయ పూజారులు విష్ణువు అవతారమైన నాగుపాము దాన్ని రక్షిస్తోందని... తెరిస్తే భారీ విధ్వంసం జరుగుతుందని అంటున్నారు.

హైదరాబాద్ కింగ్ కోఠి: హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ 210.8 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో ప్రపంచంలోని ఐదవ ధనవంతుడిగా ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. 1937లో, టైమ్ మ్యాగజైన్ అతన్ని ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా పేర్కొంది. మీర్ ఉస్మాన్ 1911లో హైదరాబాద్ నిజాం అయినప్పుడు, తన పాలనలో సంపదను బాగా పెంచుకున్నాడు. మీర్ ఉస్మాన్ అలీ ఆస్తి మొత్తం హైదరాబాద్ కింగ్ కోఠిలో దాగి ఉందని నమ్ముతారు.

కృష్ణా నదిలో నిధి నిక్షేపాలు: కృష్ణా నది ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రానికి ప్రసిద్ధి చెందింది. దీనిని హిందువులు పవిత్రమైన నదిగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఇది ప్రధాన నీటి వనరు. ఒకప్పుడు, ఈ నది ప్రపంచానికి వజ్రాల వనరు. ప్రపంచంలోని 10 వజ్రాలలో 7 ఈ నది నుండి వచ్చినవే.

రాజస్థాన్‌లోని జైగర్ కోట: రాజస్థాన్‌లోని ప్రతీ కోటకు ఓ చరిత్ర ఉంటుంది. అలాగే జైగర్ కోటకు కూడా ఉంది. ఇందులో రహస్య నిధి దాగుందని నమ్ముతారు. మన్సింగ్ జైపూర్‌కు రాజు మాత్రమే కాకుండా అక్బర్ సైన్యానికి కమాండర్ కూడా. ఆఫ్ఘన్ ఆక్రమణ తరువాత, మన్సింగ్ అక్బర్ రాజ్యానికి సంబంధించిన నిధులు దోపిడీకి గురి కాకుండా జైగర్ కోటలో దాచాడని చెబుతుంటారు. ఈ నిధిని కనుగొనాలని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పూర్వీకులు అన్నారు. దీనిపై సమాచారం లేనప్పటికీ.. ఇప్పటికీ ఆ నిధి కోటలోని ఏదొక భాగంలో ఉన్నట్లు అక్కడి ప్రజలు భావిస్తారు.
