Taliban Video : హాస్య నటుడి గొంతు కోసి చంపిన తాలిబాన్లు..! కొడుతూ హింసిస్తున్న వీడియో రిలీజ్..

uppula Raju

uppula Raju | Edited By: Anil kumar poka

Updated on: Jul 28, 2021 | 6:55 PM

Taliban Video : ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన భాగాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు ప్రజలను క్రూరంగా హింసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తాలిబాన్లు దేశంలోని ప్రసిద్ధ హాస్యనటుడు

Taliban Video : హాస్య నటుడి గొంతు కోసి చంపిన తాలిబాన్లు..! కొడుతూ హింసిస్తున్న వీడియో రిలీజ్..
Nazar Mohammad

Follow us on

Taliban Video : ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన భాగాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు ప్రజలను క్రూరంగా హింసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తాలిబాన్లు దేశంలోని ప్రసిద్ధ హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ అకా ఖాసా జవాన్ (ఖాషా జ్వాన్) ను కందహార్ ప్రావిన్స్‌లో చంపారు. అయితే హత్యకు ముందు జరిగిన సంఘర్షణకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హాస్యనటుడిని చెంపదెబ్బ కొడుతున్నట్లు చూడవచ్చు. యుద్ధంతో దెబ్బతిన్న దేశ ప్రజల ముఖాల్లో ఆనందాన్ని తెచ్చిన మహ్మద్‌ను తాలిబాన్లు ఇంటి నుంచి కిడ్నాప్ చేసి అతి క్రూరంగా చంపేశారు.

కందహార్ ప్రావిన్స్‌లో ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసే వ్యక్తులను గుర్తించి చంపడానికి తాలిబాన్లు ఇంటింటికీ వెతుకుతున్నారు. అఫ్ఘనిస్తాన్ మీడియా ప్రకారం.. నాజర్ మొహమ్మద్ కిడ్నాప్ చేసి జూలై 23 న అతన్ని హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ సంఘటనలో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ పాల్గొనడానికి నిరాకరించింది. వార్తా సంస్థ ANI ప్రకారం నాజర్ మొహమ్మద్ ఇంతకు ముందు కాందహార్ పోలీసులలో పనిచేశాడని తెలుస్తోంది.

కమెడియన్ గొంతు కోసి చంపేస్తారు.. తాలిబాన్లు హాస్యనటుడు నాజర్ మొహమ్మద్‌ను కారులో కూర్చోబెట్టడం వీడియోలో చూడవచ్చు. ఆయుధాలు తీసుకొని నాజర్‌ని చెంపదెబ్బ కొడుతూ హింసిస్తుంటం మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా అతడిని స్థానిక భాషలో తిడుతూ ఉంటారు. కమెడియన్‌ను మొదటగా ఇంటి నుంచి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసినట్లు మీడియా కథనాల్లో తెలిసింది. తరువాత గొంతు కోసి చంపేశారని తెలిసింది.

అంతకుముందు తాలిబాన్ సోహైల్ పార్డిస్ అనే ఆఫ్ఘన్ అనువాదకుడిని గొంతు కోసి చంపినట్లు నివేదించింది. ఈ అనువాదకుడు యుఎస్ ఆర్మీతో కలిసి పనిచేసేవాడు. గత వారం స్పిన్ బోల్డాక్‌లో 100 మందికి పైగా పౌరులను తాలిబాన్లు చంపారని ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తెలిపింది.

WhatsApp: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్..మీ చాటింగ్ మరింత సౌకర్యవంతం..ఎలా అంటే.. 

TS Polycet Results: విడుదలైన తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu