VIRAL VIDEO : చెంగు చెంగున ఎగురుతున్న అందాల జింకలు..! ఆ దృశ్యం చూడముచ్చటైనది.. మీరు ఓ లుక్కేయండి..

VIRAL VIDEO : భూగోళంపై నివసిస్తున్న అనేక జీవజాతులు కాల క్రమేణా అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితిని కొంతలో కొంతైనా నివారించేందుకు ప్రతిదేశం తమ

VIRAL VIDEO : చెంగు చెంగున ఎగురుతున్న అందాల జింకలు..! ఆ దృశ్యం చూడముచ్చటైనది.. మీరు ఓ లుక్కేయండి..
Beautiful Deer
Follow us

|

Updated on: Jul 28, 2021 | 12:31 PM

VIRAL VIDEO : భూగోళంపై నివసిస్తున్న అనేక జీవజాతులు కాల క్రమేణా అంతరించిపోతున్నాయి. ఈ పరిస్థితిని కొంతలో కొంతైనా నివారించేందుకు ప్రతిదేశం తమ భూభాగం పరిధిలో ప్రమాదంలో ఉన్న జీవుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఇండియాలో బ్రిటీష్ పాలనాకాలంలోనే ప్రారంభమయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం జాతీయ పార్కులను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా గుజరాత్‌లోని బ్లాక్ బక్ జాతీయ పార్కు ఒకటి.

బావ్ నగర్‌లో ఉన్న ఈ పార్కు ముఖ్యంగా జింకల సంరక్షణ కేంద్రంగా ఉంది. ఈ పార్కులో మూడు వేలకు పైగా జింకలు ఉన్నాయి. 34 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ పచ్చిక మైదానంలో జింకలు స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి.. అతి వేగంగా పరుగెత్తగలిగే ఈ జింకలు అంతరించిపోకూడదనే ఉద్దేశంతోనే 1976లో ఈ జాతీయ పార్క్‌ను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షక చట్టం ప్రకారం వీటిని వేటాడటం నేరం.

ఈ పార్కు గుండా ఉండే దారిలో ఈ అందమైన జింకలు గుంపులు గుంపులుగా రోడ్డు దాటడాన్ని కొంతమంది వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోలో చెట్ల పక్క నుంచి జింకలు చెంగు చెంగున ఎగురుతున్న ద‌ృశ్యాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. నెటిజన్లు ఈ వీడియోను ఎంతో ఇష్టపడుతున్నారు. లైకులు, కామెంట్స్ చేస్తున్నారు.

తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారా..! అయితే ఈ వ్యాధులకు గురయ్యారని అర్థం చేసుకోండి..

Tokyo Olympics 2021:ఒలంపిక్స్‌లో మరో విజయాన్ని సొంతం చేసుకున్న పీవీ సింధు.. గ్రూప్ జే నుంచి ప్రీ క్వార్ట్రర్స్‌లోకి ఎంట్రీ

Viral News: మొదటి చూపులోనే కొడుకు ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డ మహిళ.. ఇప్పుడు కలిసి డేటింగ్