Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మొదటి చూపులోనే కొడుకు ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డ మహిళ… ఇప్పుడు కలిసి డేటింగ్

ప్రేమకు, పెళ్లికి వయస్సు అడ్డుకాదని ఈ మధ్య చాలామంది చెబుతున్నారు. అదే బాటలో తమ భాగస్వాములను ఏజ్‌తో సంబంధం...

Viral News: మొదటి చూపులోనే కొడుకు ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డ మహిళ... ఇప్పుడు కలిసి డేటింగ్
40 Years Old Woman Dating
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2021 | 2:03 PM

Share

ప్రేమకు, పెళ్లికి వయస్సు అడ్డుకాదని ఈ మధ్య చాలామంది చెబుతున్నారు. అదే బాటలో తమ భాగస్వాములను ఏజ్‌తో సంబంధం లేకుండా వెతక్కుంటున్నారు. అయితే, ఏ వయసులో జరిగే ముచ్చట, ఆ వయసులో జరిగాలని మరికొందరు అంటారు. ఎవరి వాదనలు వారిని.. ఎవరి మైండ్‌సెట్స్ వారివి. తాజాగా 40 ఏళ్ల మహిళా టిక్టాక్ యూజర్ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. మొదటి చూపులోనే తన కొడుకు స్నేహితుడితో ప్రేమలో పడ్డానని చెప్పారు. విశేషం ఏమిటంటే.. ఇప్పుడు వారిద్దరూ బహిరంగంగానే కలిసి జీవిస్తున్నారు. అసలు మొత్తం విషయం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఆ మహిళ పేరు తాన్య. ప్రస్తుతం ఆమె తన కంటే 18 సంవత్సరాలు చిన్నవాడైన అబ్బాయితో డేటింగ్ చేస్తోంది. ఇది విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. ఆ మహిళ డేటింగ్ చేస్తున్న అబ్బాయి పేరు జోసు. తాన్యా తన కొడుకుతో కలిసి తొలిసారి జోసును మీట్ అయ్యానని చెబుతున్నారు. మొదటి మీటింగ్‌లోనే తాన్య జోసును ఇష్టపడిందట. ఇద్దరి మనసులు కలిశాయి. సాన్నిహిత్యం పెరగడం మొదలై చివరకు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ రెగ్యులర్‌గా కలవడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా, తాన్య కుమారుడికి కూడా ఈ సంబంధం గురించి తెలుసు. కానీ, ఎవరూ అభ్యంతరం తెలుపలేదు. తాన్యా,  జోసు ఇద్దరూ కలిసి వీడియోలను చేసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తారు. కొంతమందికి ఈ సంబంధంపై అభ్యంతరం ఉన్నప్పటికీ, చాలా మంది మాత్రం వారి బంధానికి మద్దతు పలుకుతున్నారు. జోసుతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, విమర్శించే వ్యక్తులు పట్టించుకోనని తాన్య చెప్పారు. గత 18 నెలలుగా కలిసుంటున్న వీరిరువురూ  ఈ బంధాన్ని మరింత దూరం కొనసాగించాలని కోరుకుంటున్నారు. తన సోల్‌మేట్‌ను జోసు రూపంలో కనుగొన్నానని తాన్య చెప్పడం గమనార్హం.

Also Read: వివాహిత ఇంటి ముందు వ్యక్తి సూసైడ్.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.

ఒకే ఒక్క మిస్డ్‌కాల్ ఆ యువతి జీవితం ముగిసేలా చేసింది..