AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వివాహిత ఇంటి ముందు వ్యక్తి సూసైడ్… ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.

'ఆమె లేనిదో తాను బ్రతకలేనంటూ..’ అంటూ ఓ వివాహితుడు... ప్రేమించిన వివాహిత ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్య...

Hyderabad: వివాహిత ఇంటి ముందు వ్యక్తి సూసైడ్... ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.
Suicide
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2021 | 2:03 PM

Share

‘ఆమె లేనిదో తాను బ్రతకలేనంటూ..’ అంటూ ఓ వివాహితుడు… ప్రేమించిన వివాహిత ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్‌ వాసి సురేశ్‌(35) హిమాయత్‌నగర్‌ ఓ జిరాక్స్‌ సెంటర్‌లో వర్క్ చేస్తున్నాడు. అక్కడే మరో సంస్థలో యాదవ గల్లీకి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ముగ్గురు పిల్లలున్న ఆ మహిళ విబేధాల కారణంగా భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. సురేశ్‌కు కూడా భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఏడు నెలలు కలిసి జర్నీ చేశారు. అయితే ఇటీవల ఆ మహిళ మళ్లీ తన భర్త వద్దకు వెళ్లింది. ఆమె కోసం సురేశ్‌ భార్యతో కూడా గొడవపడ్డాడు.  సదరు మహిళకు మూడు నాలుగు రోజులుగా ఫోన్‌ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో హ్యాపీగా ఉన్నానని.. సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని ఆమె సందేశం పంపింది. దీంతో సురేశ్ మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. స్థానికులు నచ్చజెప్పి పంపించేశారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల్‌ సీసాతో వెళ్లి మళ్లీ తలుపు తట్టాడు. నీ కోసం చచ్చిపోతానంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు.

సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు అతన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షలో అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని భార్యకు చెప్పగా, తొలుత రానని చెప్పినా.. పోలీసుల సర్ది చెప్పడంతో వచ్చి సపర్యలు చేసింది. చికిత్స పొందుతూ సురేశ్‌ సోమవారం సాయంత్రం కన్నుమూయడంతో కన్నీరుమున్నీరైంది.

Also Read: ఒకే ఒక్క మిస్డ్‌కాల్ ఆ యువతి జీవితం ముగిసేలా చేసింది..

నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. నిట్టనిలువునా దోచేశాడు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి