నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా… నిట్టనిలువునా దోచేశాడు

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 28, 2021 | 2:04 PM

అందుగలదు ఇందులేదు అన్న సందేహం లేకుండా ఇప్పుడు మోసం ప్రతిదానిలో భాగమైపోయింది. మనలో చాలామంది...

నిజామాబాద్ జిల్లాలో 'అత్తిలి సత్తి'... సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా... నిట్టనిలువునా దోచేశాడు
Sumangali Vratham Cheating

అందుగలదు ఇందులేదు అన్న సందేహం లేకుండా ఇప్పుడు మోసం ప్రతిదానిలో భాగమైపోయింది. మనలో చాలామంది లాజిక్కుల కంటే ఎక్కువగా మేజిక్కులనే నమ్ముతారు. అందుకే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్లు మనదేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్. నకిలీ స్వామీజీలు, దొంగ బాబాల ఉదంతాలు ఎన్ని బయటకి వచ్చినా.. జనాలు తెలివి లేకుండా ఇంకా వారి ఉచ్చులోనే పడుతున్నారు. తాజాగా సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ పూజారి. నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) లో ఓ పూజారి బారి మోసానికి తెగబడ్డాడు. శ్రీనివాస శర్మ అనే పూజారి సుమంగళి వ్రతాలూ చేస్తానని చెప్పి పలువురు మహిళల దగ్గర కోటిన్నర వసూలు చేసి ఉడాయించాడు. డిచ్ పల్లి , బోధన్ , మాక్లూర్ లో మహిళల భర్తల క్షేమం కోసం వ్రతాలూ చేస్తానని నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు నిందితుడు. కొందరు మహిళలు భర్తలకు తెలియకుండా లక్షల్లో అతడికి చెల్లించారు. శ్రీనివాస్ శర్మ మోసం చేశాడని ఆలస్యంగా గ్రహించిన బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇన్సూరెన్స్​ పాలసీల పేరుతో భారీ మోసం

ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో ఓ వృద్ధురాలి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.15 లక్షలు దండుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధురాలి(80)తో… ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి లాయాలిటీ, రివర్సల్ బోనస్​ల పేరుతో ఉత్తరప్రదేశ్​కు చెందిన ముగ్గురు సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. బోనస్ డబ్బుల ఆశ చూపి అందినకాడికి దోచుకున్నారు. ఆర్పీఐ, ప్రాసెసింగ్, సెబీ, వివిధ ఛార్జీల పేరుతో రూ.15.47 లక్షలు అకౌంట్లో వేయించుకున్నారు. అనంతరం వారి ఫోన్​ స్విచాఫ్​ రావడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు… యూపీలోని ఘజియాబాద్​కి చెందిన దేవాన్ష్, ఇమ్రాన్ ఖాన్​ను అరెస్టు చేసి రిమాండు​కు తరలించారు. మరో నిందితుడు రస్టజీ పరారీలో ఉన్నట్లు… త్వరలోనే అతడిని పట్టుకుంటామని సైబర్​ పోలీసులు తెలిపారు.

Also Read: పంటలను నాశనం చేస్తోన్న కోతులు.. చెక్ పెట్టేందుకు రైతుల మాస్టర్ ప్లాన్.. అయినా

దండకారణ్యంలో మహిళా కమాండోస్.. మావోయిస్టుల ఏరివేత కోసం స్పెషల్ ట్రైనింగ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu