Danteshwari Fighters: దండకారణ్యంలో మహిళా కమాండోస్.. మావోయిస్టుల ఏరివేత కోసం స్పెషల్ ట్రైనింగ్

మహిళలు తాము అన్ని రంగాల్లో మగవారితో సమానం అని ముందుకు దూసుకెళుతున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ అడవుల్లో...

Danteshwari Fighters: దండకారణ్యంలో మహిళా కమాండోస్.. మావోయిస్టుల ఏరివేత కోసం స్పెషల్ ట్రైనింగ్
Dantheswari womwn commandos
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2021 | 8:24 AM

మహిళలు తాము అన్ని రంగాల్లో మగవారితో సమానం అని ముందుకు దూసుకెళుతున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ అడవుల్లో నక్సల్స్ ను ఏరివేస్తూ.. అక్కడి శాంతి భద్రతలను కాపాడేందుకు తుపాకీ చేతబట్టి అడవుల్లో గస్తీ కాసేందుకు సిద్ధంమయ్యారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో నక్సల్ ప్రభావం ఎక్కువ అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. అక్కడ నక్సల్స్ దాడుల్లో ప్రతి సంవత్సరం పోలీసులతో సహా ఎందరో సాధారణ ప్రజలు కూడా ప్రాణాలను కోల్పోవడం నిత్యకృత్యమైన విషయం. అలాంటి కఠినమైన ప్రదేశంలో దంతేశ్వరీ మహిళా కమాండోల పేరుతో ముందుకు వచ్చారు ఈ మహిళా పోలీసులు. దంతేవాడ జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ నేతృత్వంలో వర్షాకాల సమయంలోనే.. ప్రత్యేకంగా మావోయిస్టుల ఏరివేత కోసం వీళ్లకి ప్రత్యేకంగా, కఠినమైన శిక్షణ ఇచ్చారు. మావోయిస్టుల ఏరివేత కోసం కొండలు, గుట్టలు, వాగులు అతి ప్రమాదకరమైన ప్రాంతాల్లో.. పనిచేసేలా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వారిని తీర్చిదిద్దారు.

మొదటిసారిగా ఈ సంవత్సరం డి ఆర్ డి జవానులతో పాటుగా, దంతేశ్వరి మహిళా కమాండోస్‌కి కలిపి.. అత్యాధునిక ఆయుధాలతో పాటుగా ఎటువంటి పరిస్థితుల నైనా ఎదురుకునే విధంగా కిట్లు, షూలు ఇచ్చి.. దండకారణ్యంలోకి మావోయిస్టులపై యుద్దానికి పంపించారు దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్. ఈనెల 28 నుంచి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు .. దంతేశ్వరి మహిళా కమాండోలు అడవిలోకి వెళుతున్నారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టులపై పట్టు సాధించాలని ఎస్పీ అభిషేక్ పల్లవ్ వ్యూహాలు రచించారు.

Also Read: పంటలను నాశనం చేస్తోన్న కోతులు.. చెక్ పెట్టేందుకు రైతుల మాస్టర్ ప్లాన్.. అయినా

 టమాటా 50, పచ్చిమిర్చి ఏకంగా 60… ముట్టుకుంటే షాకే.. వామ్మో ఏంటీ ధరలు