Vegetable Price Today: టమాటా 50, పచ్చిమిర్చి ఏకంగా 60… ముట్టుకుంటే షాకే.. వామ్మో ఏంటీ ధరలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షాలు ఎక్కడలేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వానల కారణంగా కూరగాయాలు బాగా పండుతున్నాయి...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షాలు ఎక్కడలేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వానల కారణంగా కూరగాయాలు బాగా పండుతున్నాయి, ఓ వైపు పారేసే పరిస్థితులు ఉన్నాయి. మరో వైపు అధిక ధరలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. వర్షాలు రాక ముందు వరకు అందుబాటులో ఉన్న ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 10 రూపాయలున్న టమాటా 50 రూపాయలకు చేరింది. కిలో పచ్చిమిర్చి ఏకంగా 60 రూపాయలకు అమ్ముతున్నారు. బీరకాయ, కాకరకాయ, బెండకాయ ఇలా ఏది తీసుకున్నా 60 నుంచి 80 రూపాయల ధర పలుకుతోంది. అందరికీ అందుబాటులో ఉండే ఆకుకూరలు కూడా వర్షాలకు రావడం లేదు. పంట దెబ్బతినడంతో కొరత ఏర్పడింది. వచ్చిన కొద్దిపాటి ఆకు కూరలైనా మచ్చలుంటున్నాయి. తాజాగా లేకపోవడంతో ఎవరూ కొనడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నవాటికి అధిక ధరలు పెట్టి విక్రయిస్తున్నారు.
ఒక్కసారిగా ధరలు నింగినంటేలా మారడంతో జనం బెంబేలెత్తుతున్నారు. వందరూపాయలతో.. రెండు రకాల కూరగాయాలు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. వర్షాల ప్రభావం మరో నెలరోజుల పాటు ఉండే అవకాశముందటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్పటి వరకు నాణ్యత గల కూరగాయలు కూడా దొరకడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని ధరలు సెంచరీకి చేరువలో ఉండడంతో, కూరగాయలను కొనాలంటేనే వినియోగదారులు వణికిపోతున్నారు. ఇక వంట నూనెల, ఇతరత్రా వంట సామాగ్రి ధరలు కూడా షాక్ కొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నిరోజుల పాటు ఈ ధరల భారాన్ని భరించాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు సామాన్యులు.
Also Read:అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు