Car Theft: విశాఖలో దొంగలను పట్టించిన ఫాస్టాగ్‌.. కార్లతో ఉడాయించి దొరికిపోయారు.. కీలకంగా మారిన యజమాని క్లూ..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Jul 28, 2021 | 5:54 AM

FASTag: ఎంతకొమ్ములు తిరిగిన దొంగైనా.. ఏదో ఒక క్లూ విడిచిపెట్టి వెళ్తాడు. విశాఖలో కార్లను దొంగతనం చేసిన దొంగ మూడో కంటికి తెలియకండా చెక్కేద్దామనుకున్నాడు. రాజమండ్రి నుంచి..

Car Theft: విశాఖలో దొంగలను పట్టించిన ఫాస్టాగ్‌.. కార్లతో ఉడాయించి దొరికిపోయారు.. కీలకంగా మారిన యజమాని క్లూ..!

Car Theft: ఎంతకొమ్ములు తిరిగిన దొంగైనా.. ఏదో ఒక క్లూ విడిచిపెట్టి వెళ్తాడు. విశాఖలో కార్లను దొంగతనం చేసిన దొంగ మూడో కంటికి తెలియకండా చెక్కేద్దామనుకున్నాడు. రాజమండ్రి నుంచి విశాఖ వరకు వచ్చి.. ఇక్కడ కార్లను తస్కరించి వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. కార్లను తీసుకుని ప్లాన్‌ను సక్సెస్‌ చేసేలా మూడోకంటికి తెలియకుండా కార్లను ఎత్తుకెళ్ళాడు. కానీ.. కారుకున్న ఫాస్టాగ్‌.. ఆ దొంగల బండారాన్ని బయటపెట్టింది.

ఓనర్‌ క్లూతో షెడ్డు యజమాని అలర్ట్‌:

విశాఖలో వాహనాలకు ఉండే ఫాస్టాగ్‌ దొంగలను పట్టించింది. అదెలా అంటే.. గాజువాక పంతులుగారి మేడ సమీపంలోఉంటున్న సాగర్‌ అనే వ్యక్తి.. మింది ప్రాంతంలో ఆటోకేర్‌ అనే కార్‌ షెడ్‌ నిర్వహిస్తున్నాడు. అతని షెడ్డుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్లు మరమ్మత్తుల కోసం వస్తుంటాయి. అయితే.. షెడ్డులో ఉంచిన హ్యుండాయ్‌ వెర్నాటాటా టియాగియో కార్లు చోరీకి గురయ్యాయి. తన షెడ్డు నుంచి కార్లు చోరీకి గురయ్యాయనే విషయం సాగర్‌కు తెలియలేదు. కట్‌ చేస్తే.. ఉదయాన్నే అతనికి కారు యజమాని నుంచి ఫోన్‌ కాల్‌. మరమ్మత్తులకు ఇచ్చిన కారు హైవేపై ఎందుకు తిరుగుతోందని ఓనర్‌ ప్రశ్న. అవాక్కైన సాగర్‌.. షెడ్డుకెళ్లి చూశాడు. దీంతో.. అక్కడ రెండు కార్లు మిస్సయ్యాయి. హుటాహుటిన గాజువాక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళిన కారుషెడ్డు యజమాని.. ఫిర్యాదు చేశాడు.

కేసులు కీలకంగా మారిన కారు యజమాని క్లూ..

ఇంతకీ.. షెడ్డులో కారుపెడితే చోరీకి గురైన సంగతి యజమానికి ఎలా తెలిసింది. మరి షెడ్డు నిర్వాహకుడు ఎందుకు గుర్తించలేకపోయాడు. కారుషెడ్డు యజమానితో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కారు యజమానిని పిలిపించారు. దీంతో.. యజమాని కీలక క్లూ ఇచ్చాడు. ఏంటంటే.. కారుకున్న ఫాస్టాగ్‌ నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయి. కారు దొంగిలించి తీసుకెల్తున్న సమయంలో టోల్‌ప్లాజాల వద్ద కారుకున్న ఫాస్టాగ్‌ స్కాన్‌ అయింది. రాత్రి సమయంలో రెండు నుంచి మూడు మెసేజ్‌లు తన మొబైల్‌కు రావడంతో అవాక్కైన యజమాని ఆ విషయం ఉదయాన్నే కారు షెడ్డు నిర్వాహకుడికి సమాచారం అందించాడు. ఆ క్లూ కేసును ఛేదించే విషయంలో కీలకంగా మారింది. ఈనెల 25 రాత్రి మిందిలోని కారుషెడ్డు నుంచి రెండు కార్లు దొంగిలించబడ్డాయి. ఇద్దరు దొంగలు ఆ ప్రాంతానికి వచ్చి.. రెండు కార్లను ఈజీగా ఎత్తుకెళ్ళారు. వెళ్తూవెళ్తూ.. పాతగాజువాకలోని పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కొట్టించుకున్నారు. ఆతరువాత మూడోకంటికి తెలియకుండా హ్యాపీగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ రాజమండ్రి వరకు వెళ్ళిపోయారు. మధ్యలో అగనంపూడి టోల్‌ప్లాజా దాటే సరికి ఒకసారి, రాజమండ్రి వెళ్ళేలోగా మరో రెడు మూడు ఫాస్టాగ్‌ లు స్కాన్‌ అయ్యాయి. ఆ విషయం ఈ దొంగలు గుర్తించలేదు. దర్జాగా రాజమండ్రికి కార్లను తీసుకుని వెళ్ళిపోయారు.

ఫాస్టాగ్‌, సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇది రాజమండ్రి దొంగల ముఠా పనేనని గుర్తించారు. చోరీ చేసింది సాయి భార్గవ్‌, మున్నా కుమార్‌గా గుర్తించిన పోలీసులు.. వారిని ట్రాక్ చేశారు. మున్నా, భార్గవ్‌ అనే పాతనేరస్థులను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కునెట్టారు. కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీసీసీ క్రైం సురేష్‌బాబు వెల్లడించారు.

నిందితుల చోరీల చరిత్ర:

ఇదీ కారు దొంగలను పట్టించిన ఫాస్టాగ్‌ కథ..! రాజమండ్రికి చెందిన సాయి భార్గవ్‌ , మున్నాలు అక్కడా చాలా చోరీలే చేశారు. వీరిపై 12 ఇళ్లల్లో దొంగతనాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఈ మధ్యనే జైలునుంచి విడుదలైన ఈ చోర్‌ ఫ్రెండ్స్‌.. విశాఖలో కార్లపై కన్నేసి తస్కరించి.. ఫాస్టాగ్‌ పుణ్యామాని పోలీసులకు ఈజీగా చిక్కిపోయారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Escape: స్కెచ్ వేసిన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. రూ.50 లక్షల క్యాష్‌తో పరార్.. నెల్లూరులో సంచలనం..

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు అద్దాలు ధ్వంసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu