AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. ఈ ప్లాన్‌ తీసుకుంటే ప్రతియేటా 12 వేల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వివిధ రకాల పాలసీల ద్వారా మంచి రాబడి పొందవచ్చు. వీటిల్లో పెన్షన్‌ ప్లాన్స్‌ కూడా ఉన్నాయి...

LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. ఈ ప్లాన్‌ తీసుకుంటే ప్రతియేటా 12 వేల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 28, 2021 | 8:39 AM

Share

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వివిధ రకాల పాలసీల ద్వారా మంచి రాబడి పొందవచ్చు. వీటిల్లో పెన్షన్‌ ప్లాన్స్‌ కూడా ఉన్నాయి. ఎల్‌ఐసీ సరల్‌ పెన్షన్‌ ప్లాన్‌ కూడా ఇందులో ఉంది. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా డబ్బులు పొందే సౌకర్యం ఉంది. దేశీ బీమా రంగ కంపెనీల్లో ఒకటైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) వినియోగదారులకు రకరకాల పాలసీలను అందిస్తోంది. అయితే మీరు ఎంచుకున్న ప్లాన్‌ ప్రాతిపదికన మీకు లభించే ప్రయోజనాలు కూడా మారుతాయి.

ఎల్‌ఐసీ పాలసీదారుల కోసం పెన్షన్‌ ప్లాన్స్‌ కూడా అందిస్తోంది. దీని వల్ల ప్రతి నెలా పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. సరల్‌ పెన్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఈ పాలసీ తీసుకుంటే ఒకేసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం కనీసం రూ.12 వేలు పొందవచ్చు. మీరు జీవించి ఉన్నంత కాలం మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్‌లో మీకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మీరు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేలా లైఫ్ యాన్యుటీ ఆప్షన్ ఒకటి. జాయింట్ లైఫ్ పెన్షన్ ప్లాన్ అనేది రెండో ఆప్షన్. తొలి ఆప్షన్ కింద పాలసీదారుడికి ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి పాలసీ డబ్బులు వస్తాయి.

అదే రెండో ఆప్షన్ కింద అయితే భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ వస్తుంది. ఇద్దరు మరణిస్తే.. నామినీకి పాలసీ డబ్బులు చెల్లిస్తారు. ఇకపోతే పెన్షన్ డబ్బులను నెలా, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పొందవచ్చు. మీ ఇష్టప్రకారం ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు. 40-80 ఏళ్లలోపు వయసు ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు. మీరు చెల్లించే ప్రీమియం మొత్తం ప్రాతిపదికన మీకు రావాల్సిన పెన్షన్ కూడా ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఎల్‌ఐసీ కార్యాలయంలో లేదా ఏజెంట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Personal Loan: మీరు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు.. బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? వీటిని తెలుసుకోండి

Covid Ads: వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదులు.. 332 కోవిడ్‌ యాడ్స్‌లో 12 మాత్రమే సరైనవట: స్పష్టం చేసిన ఏఎస్‌సీఐ