Personal Loan: మీరు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు.. బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? వీటిని తెలుసుకోండి

Subhash Goud

Subhash Goud | Edited By: Anil kumar poka

Updated on: Jul 27, 2021 | 10:40 AM

Personal And Gold Loan: ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కువ ఆర్థిక సమస్యలున్నవారు ఎక్కువగా ఉంటారు. వాటి నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులోన్‌, లేదంటే..

Personal Loan: మీరు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు.. బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? వీటిని తెలుసుకోండి
GOLD

Personal And Gold Loan: ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎక్కువ ఆర్థిక సమస్యలున్నవారు ఎక్కువగా ఉంటారు. వాటి నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులోన్‌, లేదంటే బంగారంపై లోన్‌ తీసుకోవడం చేస్తుంటారు. అదే సమయంలో ఏ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలోనని ఆలోచించారు. ముందుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని చూస్తుంటారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం బ్యాంకు లోన్‌, బంగారంపై లోన్‌ తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిని సలహాలు ఇస్తున్నారు.

వడ్డీ రేట్లు:

బ్యాంకు రుణం మన ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంటే వ్యక్తిగత రుణంపై సాధారణంగా 10 నుంచి 24 శాతం వరకు వడ్డీ ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో తీరుస్తారనే అశంతో పాటు రిస్క్‌ అసెస్‌మెంట్‌ను బట్టి బంగారంపై తీసుకునే రుణంలపై వడ్డీ రేటు 7 నుంచి 29 శాతం వరకు ఉంటుంది.

తీసుకున్న మొత్తాన్ని ఎంత కాలంలో చెల్లిస్తారనే అంశాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. మరిన్ని బ్యాంకులు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇస్తుంటాయి. బంగారంపై ఇచ్చే రుణం లోన్‌-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ బంగారం ఎన్ని గ్రాములు ఉంది.. ప్రస్తుత మార్కెట్‌లో దాని విలువ ఎంత ఎంత ఉంది. మీరు ఎంత లోన్‌ కావాలనుకుంటున్నారు? మీకు కావాల్సిన లోన్‌ కి, మార్కెట్‌ లో బంగారంపై ఉన్న రేట్‌కి ఎంత వ్యత్యాసం ఉంది తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని రుణం విలువను మార్చేస్తుంటాయి. బంగారు రుణం ఎల్‌టీవీ నిష్పత్తిపై ఆర్బీఐ 75 శాతం విధించింది.

లోన్‌ ప్రాసెసింగ్‌ సమయం:

కాగా, మీకు రుణం ఇచ్చే ముందు జరిగే ప్రాసెస్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు ఐటిఆర్ ఫారాలు / పేస్లిప్స్ జత చేయాల్సి ఉంటుంది. ఇలా జత చేసిన అనంతరం రుణం ఇచ్చే సమయం 2 రోజుల నుంచి 7వరకు ఉంటుంది. లోన్‌ ప్రాసెస్‌ తొందరగా పూర్తయితే మనకు కావాల్సిన లోన్‌ తొందరగానే వచ్చేస్తుంది. అలాగే బంగారంపై తీసుకునే లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు సాధారణంగా 2 శాతం వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు లోన్‌ తీసుకునే వ్యక్తులు, సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్‌ లోన్‌ పై ప్రాసెసింగ్‌ ఫీజు రుణ మొత్తంలో 1 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది.

తిరిగి చెల్లించే సమయం:

మీరు తీసుకున్న రుణాన్ని బ్యాంకులు ఏడు సంవత్సరాల వరకు గడువు విధిస్తాయి. అయితే పర్సనల్‌ లోన్‌ సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. బంగారంపై తీసుకున్న రుణం తిరిగి చెల్లించే సమయం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు 4 నుంచి 5 సంవత్సరాల వరకు లేదా కొంత ఎక్కువ సమయాన్ని ఇస్తుంటాయి.

క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి రుణం:

వడ్డీ రేట్లు మీ బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్‌ స్కార్‌ను బట్టి మారిపోతుంటాయి. క్రెడిట్‌స్కోర్‌ను బట్టి మీకు రుణాలు ఇస్తుంటాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్లు, నెలవారీ ఆదాయం, జాబ్‌ ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ మొదలైనవి పర్సనల్‌ లోన్‌ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్స్ ఆధారంగా, కొన్ని సంస్థలు ఇచ్చే లోన్లపై ఎంత వడ్డీ విధించాలో నిర్ణయిస్తాయి.

పర్సనల్‌ లోనా..? బంగారంపై లోనా..? ఏది మంచిది

పర్సనల్‌ లోన్‌ కంటే బంగారంపై లోన్‌ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే బ్యాంకులో తీసుకున్న పర్సనల్‌ లోన్‌ను విధించిన గడువులోపు చెల్లించాల్సి ఉంటుంది. సమయానికి చెల్లించనట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అదే బంగారంపై లోన్ తీసుకుంటే గడువులోపు పే చేయలేదంటే అదే బంగారాన్ని వేలం వేస్తాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu