Monkeys: పంటలను నాశనం చేస్తోన్న కోతులు.. చెక్ పెట్టేందుకు రైతుల మాస్టర్ ప్లాన్.. అయినా

అక్కడి పొలాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ బ్యానర్లలో ఉన్న జంతువును చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటి పొలాల్లో ఫ్లెక్సీలు ఏంటీ, దాంట్లో జంతువు...

Monkeys: పంటలను నాశనం చేస్తోన్న కోతులు.. చెక్ పెట్టేందుకు రైతుల మాస్టర్ ప్లాన్.. అయినా
Monkeys-Hulchal
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2021 | 7:41 AM

అక్కడి పొలాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ బ్యానర్లలో ఉన్న జంతువును చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటి పొలాల్లో ఫ్లెక్సీలు ఏంటీ, దాంట్లో జంతువు ఏంటీ అనుకుంటున్నారా.. పదండి అసలు విషయం తెలుసుకుందాం. దేశానికి అన్నం పెట్టేవారు రైతులు. అలాంటి అన్నదాతలపై ప్రకృతి కోపం చూపిస్తుంది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు మాయ చేస్తారు. దళారులు వారి నుంచి డబ్బులు దండుకుంటారు. అయినా తల్లిలాంటి భూమిని నమ్ముకొనే జీవిస్తారు రైతులు. కష్టపడి పనిచేస్తారు. అయితే ఇప్పుడు హుస్నాబాద్ రైతులకు మరో కొత్త కష్టం వచ్చిపడింది. అన్నీ తట్టుకొని, వ్యవసాయం చేస్తున్న రైతులపై కోతులు పగబట్టాయి. రైతుల కష్టానికి కోతి చేష్టలతో ఎలాంటి ఫలితం లేకుండా చేస్తున్నాయి. కోతుల స్వైరవిహారంతో విసిగిపోయిన హుస్నాబాద్ రైతులు, ఓ కొత్త ఆలోచన చేశారు. సహజంగానే కోతులకు కొండ ముచ్చులు అంటే భయం. ఇవి ఉండే ఆ ఏరియాలోకి కోతులు రావు. దీంతో ఆ రైతులు కొండ ముచ్చు బొమ్మతో ఫ్లెక్సీలు తయారు చేయించారు. ఆ బ్యానర్లను చేన్ల వద్ద ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా చీరలను చేను చుట్టూ కట్టి కాపాలా కాస్తున్నారు.

ఈ కొండముచ్చుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఫలితాన్ని ఇస్తోందని రైతులు చెబుతున్నారు. రెండుమూడు రోజులుగా కోతులు రావడంలేదని అంటున్నారు. అటవీ అధికారులు స్పందించి, కోతులు బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.

Also Read: టమాటా 50, పచ్చిమిర్చి ఏకంగా 60… ముట్టుకుంటే షాకే.. వామ్మో ఏంటీ ధరలు

అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు