Vijayawada: ఒకే ఒక్క మిస్డ్‌కాల్ ఆ యువతి జీవితం ముగిసేలా చేసింది..
ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విజయవాడలో కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21)...
ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విజయవాడలో కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21) విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతోంది. కోవిడ్ కారణంగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌లోనే క్లాసులకు హాజరవుతోంది. కాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొవ్వాడ తరుణ్ తెడ్లంలో ఉంటున్న తన సోదరి ఇంటికి గత ఏడాది వచ్చాడు. అక్క కుటుంబానికి చెందిన ఈ- సేవా కేంద్రంలో పని చేసేవాడు. ప్రాజెక్టు పని మీద మున్ని తరచూ అక్కడకు వెళ్లేది. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి… అది కాస్తా… ప్రేమగా మారింది. ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయని మున్ని విజయవాడకు వచ్చింది. ఖాళీగా ఉండడం ఎందుకని… ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్‌గా జాయిన్ అయింది. అదే సంస్థలో తరుణ్ కూడా చేరాడు. ఇద్దరూ ఒకే చోట ఉండాలని డిసైడయ్యారు. అన్నా, చెల్లెళ్లమని గుణదల ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ నెల 6 నుంచి అక్కడే ఉంటున్నారు.
ఈ నెల 23న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మున్ని ఫోన్‌కు ఆమె పాత ఫ్రెండ్ మిస్డ్‌కాల్ ఇచ్చాడు. ఆమె ఫోన్‌ని పరిశీలించిన తరుణ్… అతనితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఆ నంబర్ బ్లాక్ లిస్ట్‌లో ఉందని.. తాను మాట్లాడడం లేదని మున్ని వివరించే ప్రయత్నం చేసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో ఉన్న తరుణ్.. ‘నీతో నాకు సంబంధం లేదు.. ఎవరిదారి వారిదే’ అంటూ బయటకు వచ్చేశాడు. ఆ మాట విన్న మున్ని గదిలోపలికి వెళ్లి తలుపులు బిగించుకుంది. కొంతసేపటికి ఇంటి ఓనర్ వచ్చి, లోపల తమ పలుగు ఉందని… ఓ సారి ఇవ్వాలని బయట కూర్చున్న తరుణ్‌ని అడిగాడు. అతను తలుపు కొట్టగా… మున్ని ఎంత సేపటికీ తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా… ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే తలుపులు పగులగొట్టి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన మున్ని సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి తండ్రి కంప్లైంట్ మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తరుణ్‌పై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అయితే తరుణే మున్నిని కొట్టి చంపాడని మున్ని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Also Read:నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. నిట్టనిలువునా దోచేశాడు