AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బచ్ పన్ కా ప్యార్’ పాటకు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ఫిదా ! బుడ్డోడిపై ప్రశంసల వెల్లువ..

'బాల్యం లోని ప్రేమ' (బచ్ పన్ కా ప్యార్) అనే పాటకు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ఫిదా అయిపోయారు. ఈ పాట పాడిన బుడ్డోడు సహదేవ్ డిర్డో ను అయన ప్రశంసలతో ముంచెత్తారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం..2019 లో ఈ కుర్రాడు పాడిన ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్ లోను,

'బచ్ పన్ కా ప్యార్' పాటకు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్  ఫిదా ! బుడ్డోడిపై ప్రశంసల వెల్లువ..
Who Is Sachdev Bachpan Ka Pyaar Song Chhattisgarh Cm Bhupesh Baghel
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 28, 2021 | 2:05 PM

Share

‘బాల్యం లోని ప్రేమ’ (బచ్ పన్ కా ప్యార్) అనే పాటకు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ఫిదా అయిపోయారు. ఈ పాట పాడిన బుడ్డోడు సచ్ దేవ్ డిర్డో ను అయన ప్రశంసలతో ముంచెత్తారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం..2019 లో ఈ కుర్రాడు పాడిన ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్ లోను, సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అయి కూర్చుంది. ఇన్స్ టాగ్రామ్ లో 90 లక్షల వ్యూస్ ను కొల్లగొట్టింది. సెలబ్రిటీలు, ప్రముఖులు, చివరకు పోలీసు శాఖ సైతం ఈ సాంగ్ ని ఆస్వాదించడం విశేషం. తమ రాష్ట్రంలో సుక్మా జిల్లాకు చెందిన సహదేవ్ ని భూపేష్ బాఘేల్ పిపిపించుకుని.. ఆ పాట పాడించుకుని వాడితో ఫోటో కూడా దిగారు. తన ట్విటర్ లో ఈ పాటను ఆయన షేర్ చేస్తూ.. ‘బచ్ పన్ కా ప్యార్..వాహ్ ‘ అని అభినందించారు. ఈ బాలుడి మీద తమ రాష్ట్రం, ఈ దేశం కూడా ఎంతో అభిమానాన్ని చూపుతోందని, వీడికి మంచి భవిష్యత్తు ఉందని ఆయన ట్వీట్ చేశారు. సహదేవ్ టాలెంట్ ని అభినందించని వాళ్ళు లేరు. వినడానికి ఈ సాంగ్ సాధారణంగా ఉన్నా.. ఇందులో ఏదో ఆత్మీయ భావనలు ఉన్నాయని అంటున్నారు. చిన్నతనంలోని ప్రేమ మాధుర్యాన్ని వీడు ఎలా ఔపోసన పట్టాడో గానీ..చాలా చక్కగా..స్పష్టంగా పాడాడని కితాబిస్తున్నారు.

ఇక ర్యాపర్ బాద్ షా దీన్ని రీమిక్స్ చేసి.. ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేయగా 54.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆయనతో కలిసి మరో ఇద్దరు కూడా ఇందులో భాగం పంచుకుని తమ ఉత్సాహాన్ని మరింత పెంచుకున్నారు. హిందీలో పాడినా మరే భాషలో పాడినా దీనిలోని భావుకతను ఆస్వాదించాల్సిందే అంటున్నారు గాన ప్రియులు.

View this post on Instagram

A post shared by BADSHAH (@badboyshah)

మరిన్ని ఇక్కడ చూడండి :Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..

 ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ కుప్పంలో పోలీసుల పేరుతో కర్ణాటక దొంగల హల్‌చల్‌..:Kuppam Video.

 బాహుబలి బల్లాల దేవా రేంజ్ లో ఏకాంగా బైక్ నే అమాంతం ఎత్తితే ఎలా ఉంటుంది..ఇదిగో ఇలా ఉంటుంది.(వీడియో):Viral Video.

 మార్చరీ గది నుంచి గురక శబ్దం..! షాక్‌ తిన్న డాక్టర్లు!అరుదైన ఘటన..:Snoring Noise From Mortuary Video.