AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆఫ్ట్రాల్ సమోసా.. ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది.. పూర్తి వివరాలు

సమోసా ధర విషయంలో ఏర్పడిన వివాదం ఓ వ్యక్తి బలవన్మరణానికి దారితీసింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Viral News: ఆఫ్ట్రాల్ సమోసా.. ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది.. పూర్తి వివరాలు
Samosa
Janardhan Veluru
|

Updated on: Jul 28, 2021 | 1:25 PM

Share

Samosa Price Dispute: సమోసా ధర విషయంలో ఏర్పడిన చిన్న వివాదం కాస్తా చినికిచినికి గాలివానై.. చివరకు ఓ వ్యక్తి బలవన్మరణానికి దారితీసింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బజ్రు జైశ్వాల్(30) తన స్నేహితులతో కలిసి సమోసా తినేందుకు సమీపంలోని షాప్‌కు వెళ్లారు. షాప్‌లో రెండు సమోసాలు తిన్నారు. రెండు సమోసాలకు రూ.20లు చెల్లించాలని సదరు షాప్ యజమానురాలు కాంచన్ సాహు కోరింది. అయితే కొన్ని రోజుల క్రితం వరకు ఆ షాప్‌లో రెండు సమోసాల ధర రూ.15 (ఒక్కోటి రూ.7.50)గా ఉండేది. రూ.20 ఎందుకు చెల్లించాలంటూ షాప్ యజమానురాలితో జైశ్వాల్ వాగ్వివాదానికి దిగాడు.  ఒక్కో సమోసా ధరను రూ.2.50 పెంచడం కరెక్టుకాదంటూ రూ.5లు అదనంగా ఇచ్చేందుకు నిరాకరించాడు.  అయితే ముడి సరుకుల ధరలు పెరగడంతో సమోసా ధరను ఒక్కోటి రూ.10కి పెంచినట్లు కాంచన్ తెలిపింది. అయినా వెనక్కి తగ్గని జైశ్వాల్ మునుపటిలా రూ.15లే చెల్లిస్తానని చెప్పాడు.

సమోసా ధర విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. జైశ్వాల్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు షాపు యజమాని సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు జైశ్వాల్‌పై 294, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు స్టేషన్‌కు పిలించి ప్రశ్నించారు. పోలీసు కేసుతో తీవ్ర మనోవేధనకు గురైన నిందితుడు ఈ నెల 24న తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కుటుంబీకులు, స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించగా.. చికిత్సా ఫలితం లేకుండా ఆస్పత్రిలో మృతి చెందాడు.

ఆత్మాహుతికి పాల్పడే ముందు జైశ్వాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను కాంచన్, పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించాడు. పోలీసులు తనను స్టేషన్‌లో తీవ్రంగా కొట్టినట్లు తెలిపాడు. కాగా జైశ్వాల్ కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు ఉందని దుకాణ యజమాని కాంచన్ మీడియా తెలిపింది. జైశ్వాల్ ఆత్మాహుతికి ప్రతీకారం తీర్చుకుంటామని అతని కుటుంబీకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. మొత్తానికి రెండు సమాసాలకు సంబంధించిన రూ.5ల గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకోవడం మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read..

Covid Patient Suicide : తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య.. పోలీసుల విచారణ..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బండకేసి కొట్టిన పగలదు.. నోకియా మరో అద్భుతం.. ఆసక్తిరేపుతోన్న ఎక్స్‌ఆర్‌ 20 ప్రమోషన్‌ వీడియో.

జేసీబీతో పొలాన్ని చదును చేస్తుండగా పెద్ద శబ్దం.. ఏంటని చూడగా
జేసీబీతో పొలాన్ని చదును చేస్తుండగా పెద్ద శబ్దం.. ఏంటని చూడగా
బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!
బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించని విధ్వంసం
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌