Koo App: మీరు మన దేశపు సోషల్ మీడియా యాప్ ‘కూ’ ఉపయోగిస్తున్నారా? అయితే కూ వెరిఫైడ్ యూజర్ పసుపు టిక్ పొందండిలా.. 

KVD Varma

KVD Varma |

Updated on: Jul 28, 2021 | 11:49 AM

మనదేశపు మైక్రో బ్లాగింగ్ సైట్ 'కూ' యాప్. ఇది ట్విట్టర్ లా పనిచేస్తుంది. మనదేశంలో ఇటీవల పరిణామాల్లో ట్విట్టర్ సోషల్ మీడియా యాప్ తో సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది 'కూ' యాప్ వైపు మళ్లుతున్నారు.

Koo App: మీరు మన దేశపు సోషల్ మీడియా యాప్ 'కూ' ఉపయోగిస్తున్నారా? అయితే కూ వెరిఫైడ్ యూజర్ పసుపు టిక్ పొందండిలా.. 
Koo App

Koo App: మనదేశపు మైక్రో బ్లాగింగ్ సైట్ ‘కూ’ యాప్. ఇది ట్విట్టర్ లా పనిచేస్తుంది. మనదేశంలో ఇటీవల పరిణామాల్లో ట్విట్టర్ సోషల్ మీడియా యాప్ తో సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది ‘కూ’ యాప్ వైపు మళ్లుతున్నారు. ట్విట్టర్ లో ఉండే ఫీచర్ల మాదిరిగానే ‘కూ’ యాప్ లో కూడా ఫీచర్లు ఉండడమే కాకుండా.. దీనిలో స్థానిక భాషల్లో మన విషయాలను పంచుకునే అవకాశం ఉంది. ఇది ‘కూ’ యాప్ ప్రత్యేకత. ఇక ఇప్పుడు కూ యాప్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ యాప్ వినియోగదారులు ఇప్పుడు సంస్థ ధ్రువీకరణ పొందవచ్చు. అంటే ట్విట్టర్ లో వెరిఫైడ్ యూజర్ కు కనిపించే బ్లూ టిక్ లాంటిది.. కూ కూడా ఇస్తోంది. కాకపోతే ఇది పసుపు రంగులో ఉంటుంది. ఈ పసుపు టిక్ కు కూ సంస్థ ‘ఎమినెన్స్’ అని పేరుపెట్టింది. ఈ టిక్ వినియోగదారుని గుర్తింపును ధృవీకరిస్తుంది.

పసుపు టిక్ ఇచ్చిన తరువాత కూడా.. 

పసుపు టిక్ ఇచ్చిన తర్వాత కూడా  వినియోగదారుని పోస్ట్స ల పై కూ సమీక్ష కొనసాగిస్తుంది. సంస్థ గొప్పతనం, సాధన లేదా వృత్తిపరమైన స్థితిని గుర్తించడానికి వినియోగదారు ప్రొఫైల్‌ను పసుపు రంగులో ఉంచుతుందని కంపెనీ తెలిపింది. పసుపు టిక్ ముందుగా సెట్ చేసిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.  ప్రతి సంవత్సరం మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబరులలో ‘కూ’ యాప్ నకు చెందిన ఒక ప్రత్యేక బృందం ఎమినెన్స్ ప్రమాణాలను సమీక్షిస్తుందని కంపెనీ పేర్కొంది.

కూలో ఎలా ధ్రువీకరణ పసుపు టిక్ ఎలా పొందాలి?

కూ  గూగుల్ డాక్స్ ఫారమ్‌ను జతచేసింది. మీరు ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దీనిని నింపవచ్చు.  ఎమినెన్స్ ధృవీకరణ, ఎమినెన్స్ టిక్ తొలగింపు గురించి వినియోగదారులు పూర్తి సమాచారం ఈ డాక్యుమెంట్లో ఉంటుంది.  ఇతర యాప్ ల  మాదిరిగా, దీన్ని గూగుల్ ప్లే  స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ ఫోన్ నంబర్ ద్వారా కు కోసం సైన్ అప్ చేయవచ్చు. వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు అలాగే ఇతర వినియోగదారులను అనుసరించవచ్చు.

కూ చెబుతున్న దాని  ప్రకారం, దీని ఎమినెన్స్ టిక్ కొనలేము. ఇది ప్రమాణాల ఆధారంగా మాత్రమే లభిస్తుంది. దాని గణన  ప్రమాణాలు భారతీయ చట్టాలను అనుసరించి తాయారు చేశారు.  అలాగే వీటిలో మార్పులు చోటు చేసుకునే అవకాశమూ ఉంది.

Also Read: Nothing Ear 1: నథింగ్ ఇయర్ 1..ట్రాన్స్‌పరెంట్ ఇయర్ ఫోన్స్..మనదేశంలో ఎప్పుడు వస్తాయి..అదరగొట్టే దీని ఫీచర్లు ఏమిటంటే..

Whatsapp: ఇతరుల వాట్సాప్‌ స్టేటస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ సింపుల్‌ స్టెప్స్‌తో చాలా ఈజీ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu