Whatsapp: ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ సింపుల్ స్టెప్స్‌తో చాలా ఈజీ..
Whatsapp Status Download: ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆట్రాక్ట్ చేస్తుంది కాబట్టే...
Whatsapp Status Download: ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆట్రాక్ట్ చేస్తుంది కాబట్టే ఈ యాప్‌కు అంత క్రేజ్ ఉంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో మెసేజింగ్ యాప్‌లలో కొత్త ఒరవడిని సృష్టించింది వాట్సాప్. ఇలా తీసుకొచ్చిన ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ ఒకటి. ఉదయం లేవగానే మనలో చాలా మంది వాట్సాప్ స్టేటస్‌ను చూసిన తర్వాతే రోజును ప్రారంభిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇతరులు పోస్ట్ చేసిన స్టేటస్‌లలో మనకు నచ్చినవి ఉంటాయి. అయితే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు. ఒకవేళ ఫొటోలను తీసుకోవాలంటే స్టేటస్‌ను స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల ఫొటో క్లారిటీ తగ్గుతుంది. అంతేకాకుండా స్టేటస్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం అసాధ్యమనే విషయం తెలిసిందే. అయితే ఒక చిన్న టెక్నిక్‌ను ఉపయోగించి ఇతరుల స్టేటస్‌లో ఉన్న వీడియోలను, ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? వాట్సాప్ స్టేటస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్‌ను ఫాలో అయితే సరి..
* ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘గూగుల్ ఫైల్స్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. * అనంతరం యాప్‌ను ఓపెన్ చేసి.. ఎడమవైపు చివరలో ఉన్న మెనూ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. * తర్వాత సెట్టింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * ఆ తర్వాత ‘షో హిడెన్ ఫైల్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * ఇలా చేసిన తర్వాత మీ స్మార్ట్ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లాలి. * ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత.. ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ క్లిక్ చేసి అందులో వాట్సాప్, తర్వాత మీడియా.. అనంతరం స్టేటస్‌ను సెలక్ట్ చేసుకోవాలి. * ఈ ఫోల్డర్‌లో ఫొటో/వీడియో ఆప్షన్‌లను ఎంచుకోవడం ద్వారా స్టేటస్‌లను చూడొచ్చు. * మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో/ఫొటోపై లాంగ్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది.
Twitter Voice: ఇకపై టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు, చెబితే చాలు.. ట్విట్టర్‌లో మరో అద్భుత ఫీచర్..
Smart Watch: వర్షంలో తడిచినా.. ఏమాత్రం పాడవని 5 స్మార్ట్ వాచ్‌లు..మీ బడ్జెట్ లోనే!