Twitter Voice: ఇకపై టైపింగ్‌ చేయాల్సిన అవసరం లేదు, చెబితే చాలు.. ట్విట్టర్‌లో మరో అద్భుత ఫీచర్‌..

Twitter Voice: సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ట్విట్టర్‌. చిన్న చిన్న వ్యాఖ్యాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి...

Twitter Voice: ఇకపై టైపింగ్‌ చేయాల్సిన అవసరం లేదు, చెబితే చాలు.. ట్విట్టర్‌లో మరో అద్భుత ఫీచర్‌..
Twitter Voice
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 27, 2021 | 2:38 PM

Twitter Voice: సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ట్విట్టర్‌. చిన్న చిన్న వ్యాఖ్యాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి మన నియోజకవర్గం ఎమ్మెల్యే వరకు అందరూ ట్విట్టర్‌ వేదికనే తమ అభిప్రాయాలను, వారు చేస్తోన్న పనులను ప్రజలతో పంచుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ట్విట్టర్‌కు ఇంత క్రేజ్‌ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 19 కోట్ల మంది ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారంటేనే ఈ సోషల్‌ మీడియా సైట్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ వస్తోన్న ట్విట్టర్‌ తాజాగా మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఇకపై ట్వీట్‌ చేయాలంటే టైపింగ్‌ చేయాల్సిన పని లేకుండా వాయిస్‌ ట్వీట్‌ అనే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్‌ ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే ఐఫోన్‌, ఐపాడ్‌ను ఉపయోగిస్తోన్న యూజర్లు ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు 20 సెకన్ల నిడివి ఉంటే ఆడియోను ట్వీట్‌ చేయొచ్చు. దీనిని ఎలా ఉపయోగించుకోవాలంటే.. యూజర్లు ముందుగా ట్విట్టర్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం కంపోజ్‌ ట్వీట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత వేల్‌ లెంగ్త్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకొని వాయిస్‌ ట్వీట్‌ను రికార్డు చేయాలి. వాయిస్‌ను రికార్డు చేయడం పూర్తయిన తర్వాత ‘డన్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ట్వీట్‌ షేర్‌ చేస్తే సరిపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేవలం ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో ఎప్పుడు తీసుకొస్తామన్న దానిపై ట్విట్టర్‌ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Twitter Voice Feature

 

Also Read: OPPO Phone: ఒప్పో కొత్త 5జీ ఫోన్..లేటెస్ట్ ఫీచర్స్..దీని ధర ఎంతంటే..

ఏసీల వాడకం వల్ల పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఏసీలు ఉన్నాయో తెలుసా?

Smart Watch: వర్షంలో తడిచినా.. ఏమాత్రం పాడవని 5 స్మార్ట్ వాచ్‌లు..మీ బడ్జెట్ లోనే!