Nokia XR20: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బండకేసి కొట్టిన పగలదు.. నోకియా మరో అద్భుతం.. ఆసక్తిరేపుతోన్న ఎక్స్‌ఆర్‌ 20 ప్రమోషన్‌ వీడియో.

Nokia XR20: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను ప్రధానంగా భయపెట్టేది ఫోన్‌ సెన్సిటివిటీ. పొరపాటున ఫోన్‌ చేయి జారిందో ఇక అంతే సంగతులు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్‌ చేతికి రాకుండా...

Nokia XR20: ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బండకేసి కొట్టిన పగలదు.. నోకియా మరో అద్భుతం.. ఆసక్తిరేపుతోన్న ఎక్స్‌ఆర్‌ 20 ప్రమోషన్‌ వీడియో.
Nokia Xr 20
Follow us

|

Updated on: Jul 28, 2021 | 10:48 AM

Nokia XR20: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను ప్రధానంగా భయపెట్టేది ఫోన్‌ సెన్సిటివిటీ. పొరపాటున ఫోన్‌ చేయి జారిందో ఇక అంతే సంగతులు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్‌ చేతికి రాకుండా పోతుంది. దీంతో స్క్రీన్‌ గార్డులు, పౌచ్‌లు ఇలా రకరకాలుగా ఫోన్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాము. అయితే ఇవన్నీ ఉపయోగించినా పగిలి పోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకుగానే ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ తాజాగా ఓ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. నొకియా ఎక్స్‌ఆర్‌ 20 పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ‘బండ ఫోన్‌’ అని సంబోధించడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమో. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తయారు చేశారు.

తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన వీడియోను నోకియా మొబైల్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. ఈ వీడియోలో ఫోన్‌ సామర్థ్యాన్ని రకరాలుగా పరీక్షించారు. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌తో తీసుకురానున్న ఈ ఫోన్‌ 1.8 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా, నీటిలో మునిగినా, మట్టిలో పడిపోయినా ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ఫోన్‌ను బారత్‌లో త్వరలోనే లాంచ్‌ చేయడానికి నోకియా సన్నాహాలు చేస్తోంది.

ఫీచర్లు ఇలా ఉన్నాయి..

* ఆండ్రాయిడ్‌ 11 వెర్షన్‌తో నడిచే ఫోన్‌ను ఆండ్రాయిడ్ 12, 13, 14 వెర్షన్స్‌కు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. * 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+డిస్‌ప్లేతో పాటు 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌ అందించారు. * ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. * కెమెరా విషయానికొస్తే.. 48 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 13 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా అందించారు. * 4630ఎంఏహెచ్ బ్యాటరీ అందించిన ఈ ఫోన్‌ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. * ఆగస్టు 24 నుంచి సేల్‌ ప్రారంభంకానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర మన కరెన్సీలో రూ. 40,900గా ఉండనుంది.

Also Read: Mysterious Stars: ఇలా కనిపించి అలా మాయం అయిపోయిన నక్షత్రాలు.. గ్రహాంతర వాసుల ఓడలు అంటున్న పరిశోధకులు!

Land Rover – submarine: రోడ్డుపై.. నీటిలో దూసుకుపోతుంది.. ల్యాండ్ రోవర్ కారును జలాంతర్గామిగా మార్చాడు..

Realme Flash: ఆ ఫీచర్‌తో రానున్న తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇదే.. మరో సంచలనానికి సిద్ధమవుతోన్న రియల్ మీ..