AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Side Effects: మనం ఎంతో ఇష్టపడి తింటోన్న చికెన్‌ వల్ల ఎన్ని అనర్థాలో తెలుసా.? ఈ మాట చెబుతోంది ఎవరో కాదు..

Chicken Side Effects: ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరి వంటింట్లో చికెన్‌ ఉడకాల్సిందే. వారానికి ఒక్క రోజైనా ముక్క తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా...

Chicken Side Effects: మనం ఎంతో ఇష్టపడి తింటోన్న చికెన్‌ వల్ల ఎన్ని అనర్థాలో తెలుసా.? ఈ మాట చెబుతోంది ఎవరో కాదు..
Chicken Side Effects
Narender Vaitla
|

Updated on: Jul 28, 2021 | 9:38 AM

Share

Chicken Side Effects: ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరి వంటింట్లో చికెన్‌ ఉడకాల్సిందే. వారానికి ఒక్క రోజైనా ముక్క తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మరే ఇతర మాంసాహారంతో పోల్చినా చికెన్‌ ధర కాస్త తక్కువ ఉండడం, ప్రోటీన్లు కూడా అధికంగా లభిస్తాయనే కారణంతో చాలా మంది చికెన్‌ను ఇష్టపడి తింటారు. ఇక చికెన్‌తో తయారు చేసే వంటకాలు రుచిగా ఉండడం కూడా దీని ఆదరణకు కారణంగా చెప్పవచ్చు. మరి మనం ఎంతో ఇష్టంగా లొట్టలేసుకొని తింటోన్న చికెన్‌తో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఇది ఏదో టైం పాస్‌కు చెబుతోన్న విషయం కాదు. పరిశోధకులు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. ఇంతకీ చికెన్‌ తీసుకోవడం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు ఏంటన్న వివరాలు ఇప్పుడు చూద్దాం..

* అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషియన్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. చికెన్‌ మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడానికి కారణమవుతోందని తేలింది. చికెన్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు కారణంగా మారుతుందని సదరు జర్నల్‌లో ప్రచురించారు. అయితే చాలా తక్కువ మందిని పరిగణలోకి తీసుకొని పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్ర్తవేత్తలు అభిప్రాయపడుతున్నారు. * చికెన్‌లో బ్యాక్టీరియా ఎక్కువ శాతంలో ఉంటుందని ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చికెన్‌ చెస్ట్‌ భాగంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 2014లో అమెరికాలో సుమారు 300కిపైగా చికెస్‌ చెస్ట్‌ను పరిశీలించిన శాస్ర్తవేత్తలు చాలా వరకు చికెన్‌లో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. * లండన్‌ లిండా యూనివర్సిటీలో జరిగిన అధ్యయనం ప్రకారం.. స్థాయికి మించి చికెన్‌ తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉందని తేలింది. శాకాహారం తీసుకునే వారితో పోలిస్తే.. చికెన్‌ తీసుకునే వారిలో కొవ్వు ఎక్కువగా పెరిగినట్లు గుర్తించారు. అయితే కొద్ది మొత్తంలో చికెన్‌ను తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్‌ లభిస్తాయని చెబుతోన్న నిపుణులు ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం అని చెబుతున్నారు. * చికెన్‌లో ఉండే ఈకోలి అనే బ్యాక్టిరియా ద్వారా ఆరోగ్యానికి హానికారమణని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సొసైటీ ఫర్‌ మైక్రోబయోలజీ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సుమారు 2500 చికెన్‌ నమూనాలను పరీక్షించగా వాటిలో దాదాపు 72 శాతం వాటిలో ఈకోలీ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ బ్యాక్టీరియాలో నీటిలో ఎక్కువగా ఉంటుంది. * అయితే పరిశోధకులు ఈ విషయాలను అమెరికా పరిస్థితులకు అనుగుణంగా చెప్పారు. మరి మసాలాలు ఎక్కువగా ఉపయోగించే మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా.? అంటే.. కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేము. ఈ విషయమై మన దగ్గర కూడా పరిశోధనలు చేస్తే అసలు విషయాలు తెలుస్తాయి.

Also Read: EPF Complaints online: మీ పీఎఫ్ విషయంలో ఏదైనా ఫిర్యాదు చేయాలా? ఆన్‌లైన్ లో ఇలా చేయొచ్చు.. ఇది ఎంతో ఈజీ!

Tesla Cars: ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా రికార్డ్.. ఈ కార్ల కంపెనీ లాభాలు నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?

Maoist Martyrs: నిశ్శబ్దంగా దండకారణ్యం.. ఏజెన్సీలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌