AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Hepatitis Day: చివరి వరకూ బయటపడకుండా ప్రాణాన్ని హరించే హెపటైటిస్.. ఈ వ్యాధిని గుర్తించడం ఎలా ..

World Hepatitis Day: హెపటైటిస్.. కాలేయాన్ని నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి ఇది. చికిత్స కంటే నివారణే మేలు. హెపటైటిస్ లో పలు రకాల వైరస్ లు చివరి వరకూ బయటపడకుండా ప్రాణాన్ని హరించేస్తాయి..

World Hepatitis Day: చివరి వరకూ బయటపడకుండా ప్రాణాన్ని హరించే హెపటైటిస్.. ఈ వ్యాధిని గుర్తించడం ఎలా ..
World Hepatitis Day
Surya Kala
|

Updated on: Jul 28, 2021 | 10:06 AM

Share

World Hepatitis Day: హెపటైటిస్.. కాలేయాన్ని నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి ఇది. చికిత్స కంటే నివారణే మేలు. హెపటైటిస్ లో పలు రకాల వైరస్ లు చివరి వరకూ బయటపడకుండా ప్రాణాన్ని హరించేస్తాయి. అందుకే వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవడం అత్యవసరం. నేడు ప్రపంచ హెపటైటిస్ దినం సందర్భంగా … జులై  28న డాక్టర్ సామ్యూల్ బ్లూమ్ బర్గ్ స్మృత్యర్థం హెపటైటిస్ డే గా పరిగణిస్తున్నారు. ప్రమాదకర హెపటైటిస్ బి వైరస్ ను గుర్తించి, దాని రోగ నిర్ధారణ, వ్యాక్సిన్ కన్గొని ఎంతో మేలు చేశారాయన. హెపటైటిస్ డే ప్రధానోద్దేశం.. ఈ వైరస్ ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే. హెపటైటిస్ ఏ, బీ, సీ వైరస్ లు వ్యాప్తి చెందకుండా నివారించడం ప్రధాన లక్ష్యం. 2030 కల్లా హెపటైటిస్ ను రూపుమాపడమే టార్గెట్ గా హెపటైటిస్ డే ను జరుపుకుంటున్నాం.. ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభణ తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా హైపటైటిస్ వ్యాధికి సంబంధించిన రోగాలతో ప్రతి 30 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు ఈ నేపథ్యంలో దానిని అరికట్టే విధంగా పనిచేయాలని 2021 థీమ్ ను రూపొందించారు.

హెపటైటిస్ వ్యాధి పై అవగాహన:

ప్రమాదకరమైన హెపటైటిస్ వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దరిచేరదన్న విషయాన్ని ప్రచారం చేయాల్సి ఉంది. అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా చేపట్టాలి. హెపటైటిస్ ఏ, బీకి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరించాలి. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా హెపటైటిస్ ఏ వ్యాపిస్తుంది. ఇక రక్త మార్పిడి, ఇంజెక్షన్ల ద్వారా హెపటైటిస్ బీ, సీ వ్యాపిస్తాయి. చెప్పాలంటే ఈ వైరస్ లు శరీరంలోకి చేరకుండా ఉండాలంటే అవగాహన అత్యవసరం. అప్పుడే తగు జాగ్రత్తలు తీసుకునే వీలుంది.

ఎలా గుర్తించాలి

చిన్న పాటి రక్త పరీక్షల ద్వారా హెపటైటిస్ వైరస్ ను గుర్తించవచ్చు. హెపటైటిస్ బీ, సీ వైరస్ ను గుర్తించేందుకు స్వచ్ఛందంగా రక్త పరీక్షలు చేసుకునేందుకు జనం ముందుకు రావాలి. ఈ విషయం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. హెపటైటిస్ బీ, సీ వైరస్ లు సోకితే పది, పదిహేనేళ్ల వరకూ ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. చివరకు కాలేయం పూర్తిగా పనిచేయకుండా పోతుంది. ఆ దశలో కాలేయ మార్పిడి తప్ప వేరే ఏ చికిత్సలూ పని చేయవు.

వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. చికిత్స తీసుకోకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందన్న విషయాన్ని పేషెంట్లకు చెప్పాలి. వైద్యుల పర్యవేక్షణలో ప్రతి ఆర్నెళ్లకోసారి వైరస్ తీవ్రతను అంచనా వేసి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. హెపటైటిస్ ఏ, ఈ.. కోసం చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా ఎలాంటి చికిత్స అవసరం లేదు. కానీ హెపటైటిస్ బీ, సీలు ప్రమాదకరం. అయినా అవి చికిత్సకు లొంగుతాయి. డాక్టర్ పర్యవేక్షణలో యాంటీ వైరల్ డ్రగ్స్ తో వైరస్ నాశనమవుతుంది. సో హెపటైటిస్ గురించి ఎలాంటి అనుమానాలున్నా వైద్యుల దగ్గర నివృత్తి చేసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేసుకుని కాలేయాన్ని కాపాడుకోవాలి.

చివరిగా

హెపటైటిస్-ఎ హెపటైటిస్-ఎ వైరస్ ద్వారా వచ్చే లివర్ వ్యాధి. ఇది కలుషితమైన నీటి ద్వారా కాని, లేక కలుషితమైన ఆహారం ద్వారా కాని వ్యాప్తి చెందుతుంది. ప్రతి యేటా, ప్రపంచవ్యాప్తంగా పది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగక్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి రోగలక్షణాలు మొదలయ్యే వరకు సాధారణంగా, రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. హెపటైటిస్-ఎ టీకాతో ఈ వ్యాధిని నిరోధించవచ్చు.

Also Read: మనం ఎంతో ఇష్టపడి తింటోన్న చికెన్‌ వల్ల ఎన్ని అనర్థాలో తెలుసా.? ఈ మాట చెబుతోంది ఎవరో కాదు..