AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Land Rover – submarine: రోడ్డుపై.. నీటిలో దూసుకుపోతుంది.. ల్యాండ్ రోవర్ కారును జలాంతర్గామిగా మార్చాడు..

రోడ్లపై కార్లు దూసుకుపోవడం మనం చాలా సార్లు చూస్తుంటాం.  కానీ ఎప్పుడైనా నీటిలో వేగంగా దూసుకుని వెళ్లే కారును చూసి ఉండరు. ఓ వ్యక్తి చేసిన చిన్న ప్రయోగం పెద్ద సంచలనంగా మారింది.

Land Rover - submarine: రోడ్డుపై.. నీటిలో దూసుకుపోతుంది.. ల్యాండ్ రోవర్ కారును జలాంతర్గామిగా మార్చాడు..
Scrapman Turns Land Rover
Sanjay Kasula
|

Updated on: Jul 28, 2021 | 9:50 AM

Share

రోడ్లపై కార్లు దూసుకుపోవడం మనం చాలా సార్లు చూస్తుంటాం.  కానీ ఎప్పుడైనా నీటిలో వేగంగా దూసుకుని వెళ్లే కారును చూసి ఉండరు. ఓ వ్యక్తి చేసిన చిన్న ప్రయోగం పెద్ద సంచలనంగా మారింది. తన కారును రోడ్డుపై.. నీటిలో ప్రయాణించేలా డిజైన్ చేశాడు. అందుకే ఈ రోజుల్లో ఆ వ్యక్తి చర్చలో నిలిచాడు. అతను తన కారును జలాంతర్గామిగా చేసి నీటిలో దూసుకుపోయాలే మార్పులు చేశాడు. డెర్బీషైర్‌లోని చెస్టర్‌ఫీల్డ్‌ నివసిస్తున్న ఒక వ్యక్తి తన రేంజ్ రోవర్ క్లాసిక్‌ను జలాంతర్గామిగా మార్చాడు. ఇలా తన కారును రీ డిజైన్ చేసిన తరువాత దీనిని పరీక్షించాడు. ఇప్పుడు అతని ప్రయోగం విజయవంతం అయ్యింది.

గ్రామీణ జేమ్స్ బాండ్‌గా పేరు పొందిన ఇతను ఈ అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. వాస్తవానికి ఈ వ్యక్తి 1987 మోడల్ రేంజ్ రోవర్ క్లాసిక్ కొనుగోలు చేశాడు. జుగాడింగ్ ద్వారా దీనిని జలాంతర్గామిగా మార్చాడు. ఈ పనిలో అతనికి ఆండ్రూ టఫ్, బ్లేక్ కాపువానో అనే ఇద్దరు స్నేహితులు మద్దతుగా నిలిచారు. రేంజ్ రోవర్‌ను జలాంతర్గామిగా ఎందుకంటే మార్చారు అంటే.. దీని వెనుక ఓ పెద్ద కథ ఉంది.

తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏప్రిల్ 2021న ఈ మిషన్ మొదలు పెట్టాడు.  34 ఏళ్ల నాథన్ గిబ్బన్స్ జూలై 18 నాటికి రేంజ్ రోవర్ జలాంతర్గామి ప్రయోగాత్మకంగా మార్చాడు. ఇది నాలుగు అడుగుల కాలువ పైపును కలిగి ఉంది. దీని సహాయంతో కారు నీటి లోపల 8 అడుగుల వరకు వెళ్లి అక్కడ తేలుతూ ఉంటుంది. నాథన్ స్వయంగా దాని టెస్ట్ డ్రైవ్ చేశాడు. ఇందులో మరో ప్రత్యేక విషయం ఏమిటంటే..  దాని ఇంజిన్‌లోకి నీరు వెళ్లకుండా డక్ట్ టేప్‌తో మాత్రమే క్లోజ్ చేశారు.

మొదటిసారి ఈ ప్రయోగం చేస్తున్న సమయంలో కొంత భయం వేసిందని నాథన్ చెప్పుకొచ్చాడు. తన కారు కొద్ది .. కొద్దిగా నీటిలో మునిగిపోతున్న సమయంలో చాలా ఉత్కంఠగా అనిపించిందని.. ఎంతో టెన్షన్‌తో ప్రయోగాన్ని విజయవంతం చేసినట్లుగా నాథన్ చెప్పుకొచ్చాడు. తనను అంతా గ్రామీన జేమ్స్ అంటారని.. ఇది చేస్తున్న సమయంలో జేమ్స్ బాండ్‌లాగా ఫీల్ అయ్యానన్నాడు.

ఇది కూడా చదవండి: అమ్మో.. పాలు కాదు.. కాలకూట విషం.. కల్తీ మాఫియా గుట్టురట్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు

ఇది కూడా చదవండి: Karnataka New CM: కర్నాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై.. ఇవాళ ప్రమాణస్వీకారం..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు