TS Polycet Results: విడుదలైన తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 28, 2021 | 12:55 PM

TS Polycet Results: తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదలయ్యాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షా ఫలితాలను రాష్ట్ర..

TS Polycet Results: విడుదలైన తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..
Polycet 2021

TS Polycet Results: తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదలయ్యాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆగస్టు 5 నుంచి తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 1న విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ అనంతరం 6 నుంచి 12వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఇస్తారు. ఇక ఆగస్టు 14న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఇక రెండో విడత కౌన్సిలింగ్‌ను ఆగస్టు 23న నిర్వహించనున్నారు. రెండో విడతలో స్లాట్‌ బుకింగ్‌కు కేవలం ఆగస్టు 23 ఒక్క తేదీ మాత్రమే అవకాశం కల్పిస్తారు. మరుసటి రోజు (ఆగస్టు 24)న సర్టిఫికేట్ల పరిశీలన చేస్తారు. ఇక 24,25వ తేదీల్లో వెబ్‌ ఆప్షన్స్‌కు అవకాశం ఉంటుంది. ఆగస్టు 27న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.

ఫలితాలను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

* ముందుగా టీపాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ tspolycet.nic.in.లోకి వెళ్లాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న టీఎస్‌ పాలిసెట్‌ రిజల్ట్స్‌ 2021పై క్లిక్‌ చేయాలి. * తర్వాత హాల్‌ టికెట్ నెంబర్‌ను ఎంటర్‌ చేసి వ్యూ ర్యాంక్‌ కార్డును క్లిక్‌ చేయాలి. * వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. * భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రింట్ తీసుకుకోవాల్సి ఉంటుంది.

Also Read: Onion for Skin Care: ఉల్లితో చర్మ సంరక్షణ.. మాయాజాలం చేసి, కాంతివంతంగా తయారు చేస్తుంది

VIRAL VIDEO : చెంగు చెంగున ఎగురుతున్న అందాల జింకలు..! ఆ దృశ్యం చూడముచ్చటైనది.. మీరు ఓ లుక్కేయండి..

EPF: మెడికల్ అవసరాల కోసం ఒక్క గంటలో మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు.. ఆన్‌లైన్ లోనే ఎలా అప్లై చేయవచ్చో తెలుసుకోండి!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu