Onion for Skin Care: ఉల్లితో చర్మ సంరక్షణ… మాయాజాలం చేసి, కాంతివంతంగా తయారు చేస్తుంది

చర్మ సంరక్షణ కోసం చాలా మంది వివిధ రకాల హెమ్ రెమిడీస్ ఫాలో అవుతారు. కాగా ఉల్లిపాయను కూడా స్కిన్ కేర్ కోసం ఉపయోగించవచ్చు.

Onion for Skin Care: ఉల్లితో చర్మ సంరక్షణ... మాయాజాలం చేసి, కాంతివంతంగా తయారు చేస్తుంది
Onion For Skin Care
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2021 | 2:01 PM

చర్మ సంరక్షణ కోసం చాలా మంది వివిధ రకాల హెమ్ రెమిడీస్ ఫాలో అవుతారు. కాగా ఉల్లిపాయను కూడా స్కిన్ కేర్ కోసం ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఉల్లిపాయలలో విటమిన్ ఎ, సి, ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయ మొటిమలు నివారిణిగా పనిచేస్తుంది. అనేక అంటువ్యాధుల నుంచి కూడా మన చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సంరక్షణ కోసం మీరు ఉల్లిపాయను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

 మొటిమల నుంచి రక్షణ కోసం – ఉల్లిపాయ తీసుకొని సగానికి కట్ చేసుకోండి. తురిమిన ఉల్లిపాయను ఒక గిన్నెలో ఉంచండి. అందులో సమాన పరిమాణంలో తేనె, తాజా నిమ్మరసం కలపాలి. ఆ పేస్ట్‌ను, ముఖంపై మొటిమల ఉన్న ప్రదేశంలో రాయాలి. ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మెత్తగా మసాజ్ చేసి, ఆపై 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. రెండు, మూడు వారాల పాటు ఇలా చేస్తే.. మొటిమల బారి నుంచి విముక్తి పొందవచ్చు.

వృద్ధాప్య ఛాయలు తొలగించడానికి- ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆపై దాన్ని మిక్సీలో వేసి రసం అయ్యేవరకు పట్టండి. అనతరం కాటన్‌తో ముఖం, మెడ అంతా ఉల్లిపాయ రసాన్ని రాయండి. అలా 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై సాదా నీటితో కడగాలి. యాంటీ ఏజింగ్ చర్మ సంరక్షణ కోసం మీరు వారానికి రెండుసార్లు ఇలా ట్రై చేయవచ్చు.

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి – ఒక చెంచా తాజా కలబంద జెల్ తీసుకొని దానికి కొన్ని చుక్కల ఉల్లిపాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ అంతా అప్లై చేసి 2-3 నిమిషాలు మెత్తగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై మంచినీటితో కడగండి. స్కిన్ గ్లోయింగ్ కోసం మీరు ప్రతిరోజూ ఇలా చేయవచ్చు.

చర్మం పొడిబారకుండా ఉండేందుకు-  ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి.. మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. 2 చెంచాల ఓట్‌మీల్‌ తీసుకొని మెత్తగా పొడి అయ్యే విధంగా మిక్సీ పట్టాలి. అనంతరం ఉల్లిపాయ రసం తీసుకొని దానికి ఒక చెంచా తాజా పెరుగు, ఓట్‌మీల్‌ పౌడర్ జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అలాగే మెడ మీద అప్లై చేయండి. రెండు నిమిషాలు తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత స్వచ్ఛమైన, చల్లటి నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి 2-3 సార్లు ట్రై చేయవచ్చు.

Also Read: మొదటి చూపులోనే కొడుకు ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డ మహిళ.. ఇప్పుడు కలిసి డేటింగ్

 మునుగోడులో హైటెన్షన్.. పోలీసుల అదుపులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి