రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా..! అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Leftover Rice : ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం చాలామందికి అలవాటు. మీరు కూడా ఇలా చేస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేకపోతే ఈ

రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా..! అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Rice
Follow us
uppula Raju

|

Updated on: Jul 28, 2021 | 1:48 PM

Leftover Rice : ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం చాలామందికి అలవాటు. మీరు కూడా ఇలా చేస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేకపోతే ఈ పాడైన అన్నం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మిగిలిపోయిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మిగిలిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి హానికరం అని చాలా పరిశోధనలు వెల్లడించాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిన అన్నంతినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. అటువంటి పరిస్థితిలో మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినడం మానుకోవాలి. అంతేకాదు ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ కూడా కావొచ్చు.

ఈ నివేదిక ప్రకారం.. బియ్యం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బ్యాక్టీరియాగా మారుతుంది. దీని తరువాత ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అందువల్ల అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అన్నం చాలా సమయం నిల్వ ఉంటే తినకూడదు. సరైన పద్దతి ఏంటంటే మీరు అన్నం వండిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలలోపు తినాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం కొన్ని గంటల తర్వాత తినవచ్చు. కానీ ఒక రోజు తర్వాత తినకూడదు. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది. అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి. మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నం తినకూడదు.

Modi vs Didi: 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మమత వ్యూహాలు.. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి కానున్నారా?

APVVP Recruitment: కడప ఏపీవీవీపీలో పీడియాట్రీషియన్‌ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం పొందే అవకాశం..

Tokyo Olympics 2021: 10 గోల్డ్ మెడల్స్‌తో పతకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో జపాన్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..