Dasyam Vijayabhaskar : రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష.. పూర్తి వివరాలు
తెలంగాణ ఉద్యమం సందర్బంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు జైల్ శిక్ష పడింది...
Dasyam Vijayabhaskar : తెలంగాణ ఉద్యమం సందర్బంగా రైల్ రోకోలో పాల్గొన్న కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌కు శిక్ష పడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైలురోకోలో పోల్గొన్న కేసులో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సహా, మొత్తం 18 మందికి రూ.3 వేల జరిమానాను కోర్టు విధించింది.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఖాజీపేట వద్ద రైలురోకో కేసులో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దాస్యం వినయ్ భాస్కర్ పై నేరాభియోగాలు రుజువైనట్లు ప్రజాప్రతినిధుల కోర్టు వెల్లడించింది. దాస్యం వినయ్‌భాస్కర్ ప్రస్తుతం పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వినయ్ భాస్కర్.. 2015 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. 2019, సెప్టెంబర్ 7న ప్రభుత్వ చీఫ్‌విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ నియమితులయ్యారు.