Vikarabad: కాపురానికి రాని భార్య.. తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. బ్లేడుతో కోసుకుని..
Man Suicide Attempt: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి
Man Suicide Attempt: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా తాండూర్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని గురుకుంటకు చెందిన అడిగి సంగమేశ్వర్ తన భార్యతో కలిసి ఎన్టీఆర్ కాలనీలో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. ఈ ప్రాంతంలోనే పాలిసింగ్ యూనిట్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంగమేశ్వర్‌కు, తన భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో తన భార్య ఆమె అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో భార్య అక్కా, బావాతో కూడా మాట్లాడాడు. అయినా తన భార్య ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
తన భార్యను కాపురానికి పంపించడం లేదంటూ మనస్తాపానికి గురైన సంగమేశ్వర్.. బ్లేడ్‌తో గొంతు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయింది. అయితే.. సంగమేశ్వర్‌ను గమనించిన స్థానికులు వెంటనే అతనిని తాండూర్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.
Also Read: