AP Crime News: కిరాతకం.. పచ్చని పొలాల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్ దారుణ హత్య.. కిడ్నాప్ చేసి
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో ఓ యువకుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్...
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో ఓ యువకుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ వంశీని కిడ్నాప్ చేసిన దుండగులు 50లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కిరాతకంగా హతమార్చి స్పాట్ నుంచి పరారయ్యారు. వంశీని డబ్బుకోసమే కిడ్నాప్ చేస్తే డబ్బు తీసుకోకుండా ఎందుకు చంపారన్నది మిస్టరీగా మారింది. కొనకళ్ల వంశీ కోల్‌కతాలోని నీట్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కరోనా కారణంగా మూడు నెలలుగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వంశీ తండ్రి శ్రీనుకి కాల్ వచ్చింది. మీ బిడ్డను కిడ్నాప్ చేశామని.. వదిలేయాలంటే 50లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకునే స్థోమత తనకు లేదని శ్రీను వేడుకున్నాడు. ఎంతోకొంత తీసుకుని ఊరు చివరకు వచ్చి డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు ఫోన్ పెట్టేశారు.
కిడ్నాపర్లు చెప్పినట్టే శ్రీను ఊరు చివరకు వెళ్లాడు. కానీ వాళ్లు రాకపోవడంతో నిరాశగా ఇంటికి వెనుదిరిగాడు. అంతలోనే వంశీ మృతదేహాన్ని గమనించిన స్తానికులు శ్రీనుకి సమాచారమిచ్చారు. వంశీ ముఖంపై గాయాలు ఉన్నాయి. గొంతునులిమి చంపినట్టు సీన్ ఆఫెన్స్‌ను బట్టి తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వంశీని చంపింది ఎవరు.. అంతలా పగ ప్రతీకారం ఎవరితో ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటికే ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: Krishna District: కొండంత ఆశ.. నిండైన కళ్లతో వజ్రాల కోసం వెతుకులాట..