Krishna District: కొండంత ఆశ.. నిండైన కళ్లతో వజ్రాల కోసం వెతుకులాట..

ఒక్క వజ్రం.. ఒకే ఒక్క వజ్రం.. దొరికితే చాలు క్షణాల్లో లక్షాధికారో, కోటీశ్వరుడో అయిపోవచ్చు.. 'దేవుడా ప్లీజ్ వజ్రం దొరికే విధంగా చూడు' అంటూ...

Krishna District: కొండంత ఆశ.. నిండైన కళ్లతో వజ్రాల కోసం వెతుకులాట..
Diamonds Hunt
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 28, 2021 | 1:11 PM

ఒక్క వజ్రం.. ఒకే ఒక్క వజ్రం.. దొరికితే చాలు క్షణాల్లో లక్షాధికారో, కోటీశ్వరుడో అయిపోవచ్చు.. ‘దేవుడా ప్లీజ్ వజ్రం దొరికే విధంగా చూడు’ అంటూ జనాలు అక్కడ వెతుకులాటలో బిజీ అయిపోయారు. అవును కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో ఈ సీన్ కనిపించింది.  గుడిమెట్ల సమీపంలోని వజ్రపుగుట్టలో జనాలు వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కొండ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వజ్రాల కోసం పొలాలలో కుస్తీ పడుతున్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి వచ్చిన ప్రజలు వజ్రాల కోసం వెతుకులాట సాగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో వజ్రాలతో పాటు పంచలోహ విగ్రహాలు దొరికాయన్న ప్రచారం ఉంది. గతంలో రాజులున్న ప్రాంతం కావడంతో వజ్రాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరైతే కూలీలను పెట్టి మరీ వజ్రాల కోసం గాలింపు జరుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకుంది.

అయితే ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి వజ్రాలు తారసపడలేదు. తొలకరి వర్షాల వేళ ఇలా వజ్రాలు కోసం వేట సాగించడం సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది.   తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు జనాలు పొలాల్లో వాలిపోతున్నారు. తదేకంగా చూస్తూ..వెతుకుతుండడం కనిపిస్తోంది. ఏదైనా మెరుపుగా కనిపించగానే.. అమాంతం దానిని పట్టుకుని తమ లక్కు తిరిగిందా లేదా అని ఆశగా చూస్తున్నారు. పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు పొలాల్లో తిరుగుతూ.. వజ్రాన్వేషణ సాగిస్తున్నారు.  కాగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలో,  అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామంలో కూడా వజ్రాల వేట కొనసాగుతుంది.

Also Read: మొదటి చూపులోనే కొడుకు ఫ్రెండ్‌తో ప్రేమలో పడ్డ మహిళ.. ఇప్పుడు కలిసి డేటింగ్

 వివాహిత ఇంటి ముందు వ్యక్తి సూసైడ్.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.