Astronomer: టాలెంట్ అంటే ఈ చిన్నారిదే.. 7 గ్రహశకలాలను కనిపెట్టి.. చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలిక..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 28, 2021 | 4:26 PM

World's youngest astronomer: ఖగోళశాస్త్రం, అంతరిక్షం గురించి చెబుతున్నా చాలా మందికి అర్థం కాదు.. కానీ ఆ చిన్నారికి మాత్రం ఎనలేని మక్కువ. అంతరిక్షం గురించి ఏం అడిగినా చిటికెలో సమాధానం చెబుతుంది. గ్రహాలు,

Astronomer: టాలెంట్ అంటే ఈ చిన్నారిదే.. 7 గ్రహశకలాలను కనిపెట్టి.. చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలిక..
World's Youngest Astronomer

World’s youngest astronomer: ఖగోళశాస్త్రం, అంతరిక్షం గురించి చెబుతున్నా చాలా మందికి అర్థం కాదు.. కానీ ఆ చిన్నారికి మాత్రం ఎనలేని మక్కువ. అంతరిక్షం గురించి ఏం అడిగినా చిటికెలో సమాధానం చెబుతుంది. గ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు, చంద్రుడు.. వీటి గురించి అధ్యయనం సైతం చేసి.. శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేసింది. ఏడేళ్ల వయస్సులోనే ఏడు గ్రహశకలాలను గుర్తించి అంతరిక్ష పరిశోధకురాలిగా మారింది. ఆ ఏడేళ్ల పాప పేరు నికోల్ ఒలివిరా. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కి చెందినది. ఏడేళ్ల వయస్సులోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిర్వహించిన పోటీలో 7 గ్రహశకలాల్ని కనిపెట్టి.. పరిశోధకురాలిగా మారింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొల్లాబరేషన్లో భాగంగా నాసా.. ఆస్టరాయిడ్ హంట్ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఈ సిటిజన్ సైన్స్ ప్రోగ్రాంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారి ఒలివిరా 7 గ్రహశకలాల్ని గుర్తించి నాసా నుంచి సర్టిఫికెట్ కూడా పొందింది. అయితే.. ఈ సర్టిఫికెట్ పొంది.. అతిపిన్న అంతరిక్ష పరిశోధకురాలిగా ఒలివిరా రికార్డుల్లోకెక్కెంది.

అయితే ఒలివిరా.. చిన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూపించి అది కావాలని అడిగిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అప్పటినుంచి ఈ చిన్నారికి అంతరిక్షం, ఖగోళశాస్త్రంపై మక్కువని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఒలివిరా పాఠశాలల్లో ఆస్ట్రానమీ లెక్చర్లు సైతం ఇస్తోంది. దీనిలో భాగంగా బ్రెజిల్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆమెతో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఏరోనాటిక్స్ సెమినార్‌లో మొట్టమొదటి లెక్చర్ కూడా ఇప్పించింది.ఈ చిన్నారి తన లెక్చర్లన్నీ ఆన్‌లైన్‌లో ఇస్తుందని తల్లిదండ్రులు తెలిపారు. నికోలాకి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందని.. అందులో రోదసిపై అవగాహన వీడియోలు షేర్ చేస్తుంది. అలాగే గ్రహశకలాలు, అంతరిక్షం, నక్షత్రాల గురించి చెబుతూ.. శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేస్తుందని పలువురు పేర్కొన్నారు.

Also Read:

Viral News: గంటలో పెళ్లి.. ఇంతలో పోలీసులు ఎంట్రీ.. ఎగిరి గంతేసిన వధువు.. అసలేం జరిగిందంటే?

Taliban Video : హాస్య నటుడి గొంతు కోసి చంపిన తాలిబాన్లు..! కొడుతూ హింసిస్తున్న వీడియో రిలీజ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu