కుటుంబ సభ్యుల ఆటపాటల మధ్య కర్ణాటక కొత్త సీఎం బసవ రాజ్ బొమ్మై హర్షం
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఇంట్లో ఆటపాటలతో స్వాగతం పలికారు.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఇంట్లో ఆటపాటలతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో పాపులర్ అయిన ‘నేనే రాజకుమారా’ అనే పాటను వారు పాడుతుండగా అయన సోఫాలో చిరునవ్వుతో తన భార్య తోను, కుమార్తె తోను కలిసి ఈ ఆనంద క్షణాలను పంచుకున్నారు. ఈ కుటుంబ బంధువులు కూడా ఉత్సాహంతో ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇంత చక్కని కుటుంబం ఉండడం తన అదృష్టమే అని బొమ్మై వ్యాఖ్యానించారు., 61 ఏళ్ళ ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అంతు లేకపోయింది. వారంతా ఇంట్లో ఆయన చుట్టూ చేరి తమ ఆటపాటలతో ఇంటిని మధుర ‘కుటుంబం’ గా మార్చేశారు. తన తండ్రికి తమ కుటుంబమే ముఖ్యమని, ఇప్పటికీ ఆయన ఇదే ఆప్యాయతను కనబరుస్తున్నారని బొమ్మై కుమార్తె చెప్పారు. ఇక తన భర్త సీఎం కావడంపై ఆయన భార్య చెన్నమ్మ హర్షాతిరేకంతో స్పందిస్తూ.. ఇదంతా దేవుడి ఆశీస్సులెనని వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన హార్డ్ వర్క్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఆమె చెప్పారు. కోవిడ్ సమయంలో ఆయన ప్రజలకు ఎలా సేవ చేశారో ఇకపై కూడా అలాగే సేవలు చేస్తారని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. కాగా బొమ్మై తండ్రి ఎస్.ఆర్. బొమ్మై 1988-89 మధ్య కర్ణాటక సీఎంగా వ్యవహరించారు. తన తండ్రి మాదిరే బొమ్మై కూడా మంచి పాలనా సామర్థ్యం కనబరుస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇక ఈ కొత్త ముఖ్యమంత్రి గురువారం నుంచి పాలనా వ్యవహారాల్లో బిజీ కాబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: IND vs SL: నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. నెమ్మదించిన రన్ రేట్..
మంచు పర్వతాల మధ్యలో అద్భుతమైన ప్రాంతాలు.. బడ్జెట్ రూ. 3 వేల కంటే తక్కువే