AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..

ICICI Bank Service Charges: ఐసీఐసీఐ బ్యాంక్ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. ఖాతాదారులకు 6 మెట్రో న‌గ‌రాల్లో

ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..
ICICI Bank Service Charges
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2021 | 8:13 PM

Share

ICICI Bank Service Charges: ఐసీఐసీఐ బ్యాంక్ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. ఖాతాదారులకు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల ( ఆర్థిక, ఆర్థికేత‌ర ) సేవ‌లు ఉచితంగా ల‌భించనున్నట్లు వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంకు న‌గ‌దు లావాదేవీలు, ఏటీఎం ఇంట‌ర్‌ ఛేంజ్‌, చెక్‌ బుక్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుంచి మార‌నున్నట్లు వెల్లడించింది.

సవరించిన ఛార్జీలు ఇలా.. ∙ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలల్లో నెల‌కు మొత్తం 4 ఉచిత న‌గ‌దు లావాదేవీల‌ను అనుమ‌తించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేయనున్నారు. ∙ ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా లభించనున్నాయి. ∙ మెట్రో న‌గ‌రాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో మొద‌టి 5 లావాదేవీలు ఉచితంగా లభించనున్నాయి. ∙ బ్యాంకు ప్రతీ ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేత‌ర లావాదేవీకి రూ.8.50 వ‌సూలు చేయనుంది. ∙ హోం బ్రాంచ్‌లో న‌గ‌దు లావాదేవీ ప‌రిమితి నెలకు రూ.1ల‌క్ష వరకు ఉచితంగా ప్రకటించింది. లక్ష రూపాయలు దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ వసూలు చేయనుంది. ఇది క‌నిష్ఠంగా రూ.150కు లోబ‌డి ఉంటుంద‌ని బ్యాంక్ తెలిపింది. ∙ నాన్ హోమ్ బ్రాంచ్ వ‌ద్ద రోజుకు రూ.25,000 వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీల‌కు ఛార్జీలు ఉండవు. రూ.25,000 పైన ప్రతీ రూ.1000కి రూ.5 ఛార్జీ వసూలు చేయనుంది. క‌నీసం రూ. 150కి లోబ‌డి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ∙ థ‌ర్డ్‌ పార్టీ లావాదేవీల ప‌రిమితి రూ. 25,000గా నిర్ణయించారు. రోజూకు రూ.25,000 ప‌రిమితి వ‌ర‌కు లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 ప‌రిమితికి మించి న‌గ‌దు లావాదేవీలు అనుమ‌తించరు. ∙ ఒక నెల‌లో మొద‌టి 4 లావాదేవీల‌కు ఛార్జీలు ఉండవు. ఆ త‌ర్వాత రూ.1000 లావాదేవీకి రూ.5 ఛార్జీ వసూలు చేస్తారు. క‌నీసం రూ.150కి లోబ‌డి ఉంటుంది. ∙ ఒక సంవత్సరంలో తీసుకున్న 25 చెక్‌లున్న చెక్ బుక్‌కి ఛార్జీలు ఉండవు. ఆ త‌ర్వాత అదే ఏడాది 10 చెక్‌లున్న చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ.20 వ‌సూలు చేస్తుంది.

Also Read:

Tax Saving Tips: మీరు ట్యాక్స్ పేయర్లా.. అయితే ఇలా పన్ను మినహాయింపులు పొందండి..

EPF: మెడికల్ అవసరాల కోసం ఒక్క గంటలో మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు.. ఆన్‌లైన్ లోనే ఎలా అప్లై చేయవచ్చో తెలుసుకోండి!

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?