Tax Saving Tips: మీరు ట్యాక్స్ పేయర్లా.. అయితే ఇలా పన్ను మినహాయింపులు పొందండి..

Tax Saving Tips: చాలా మంది ఎంతో కష్టపడి సంపాదిస్తుంటారు. అలా సముపార్జించిన మొత్తానికి అంతేస్థాయిలో ప్రభుత్వాలకు..

Tax Saving Tips: మీరు ట్యాక్స్ పేయర్లా.. అయితే ఇలా పన్ను మినహాయింపులు పొందండి..
Tax Payers
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 28, 2021 | 5:01 PM

Tax Saving Tips: చాలా మంది ఎంతో కష్టపడి సంపాదిస్తుంటారు. అలా సముపార్జించిన మొత్తానికి అంతేస్థాయిలో ప్రభుత్వాలకు ట్యాక్స్‌ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కొందరు ట్యాక్స్‌ కట్టకుండా.. ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. అయితే, కొందరు మాత్రం అక్రమ మార్గాల ద్వారా పన్నులు చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఈ ప్రయత్నాలు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. తేడా వస్తే అసలుకే మోసం వస్తుందని, సంపాదించిందంతా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి భారత ప్రభుత్వ చట్టాల్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి అనేక మినహాయింపులు ఉంటాయి. వాటి ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. మరి పన్ను మినహాయింపులు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత రాజ్యాంగంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపులు ఇవే.. 1. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కింద ఆరోగ్య బీమా కోసం ఏటా చెల్లించే ప్రీమియంలలో వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 2. పొదుపు ఖాతాల్లో జమ చేసిన సొమ్ములో రూ.10 వేల వరకు సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్స్‌ అయితే ఈ పరిమితి రూ.50 వేల వరకు ఉంటుంది. 2. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పెట్టుబడిపై సెక్షన్‌ 80సీసీడీ(1బి) కింద రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 3. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌)పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ లభిస్తుంది. 4. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం ద్వారా లభించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 5. వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలతో పాటు ధార్మిక కార్యక్రమాలకు చేసే ఖర్చులో 50 శాతం వరకు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంటుంది. అయితే, దీనిలో కొన్ని షరతులు ఉంటాయి. దాని ప్రకారం పన్ను మినహాయింపులు కోరవచ్చు. 6. వివిధ రకాల ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఆ ప్రీమియంల మొత్తం 1.5 లక్ష రూపాయలు మించకూడదు. 7. సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగుల వేతనాల నుంచి 12 శాతం ఈపీఎఫ్‌లో కలిసిపోతుంది. దీనిలో ఏటా రూ.1.5 లక్షల ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంటుంది. 8. 10 సంవత్సరాల లోపు బాలికల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా పొదుపు చేసినట్లయితే.. వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. 9. పిల్లల చదువు కోసం చెల్లించే వార్షిక ట్యూషన్‌ ఫీజులో రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు లభిస్తాయి. 10. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో పెట్టే పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 11. ఐదేళ్ల కాలపరిమితితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. 12. గృహ రుణాలకై జరిపే చెల్లింపులో భాగంగా ఏటా చెల్లించే అసలులో రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. 13. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో వచ్చే రాబడిపై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్ ట్యాక్స్‌ ఉంటుంది. అయితే, రూ.1 లక్ష వరకు ఈ మినహాయింపు పొందవచ్చు.

Also read:

PM Kisan Yojana: రైతులకు గమనిక.. పీఎం కిసాన్ యోజన పథకంలో చేరేందుకు ఏఏ సర్టిఫికెట్స్ కావాలో తెలుసా..

Karnataka Cabinet: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తొలి కేబినెట్ సమావేశం.. మొదటి నిర్ణయం ఏం తీసుకున్నారంటే..?

AP Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు..

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?