PM Kisan Yojana: రైతులకు గమనిక.. పీఎం కిసాన్ యోజన పథకంలో చేరేందుకు ఏఏ సర్టిఫికెట్స్ కావాలో తెలుసా..
దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు
దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు మోదీ ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ ప్రవేశపట్టిన సంగతి తెలిసిందే. అందులో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అందులో భాగంగా ప్రతి ఏటా రూ. 6 వేలు పీఎం కిసాన్ పథకం ద్వారా అందించనున్నారు. అయితే ఈ డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లో వేయదు. విడతల వారిగా రూ. 2 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయనుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 12 కోట్లు మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఇప్పటికే ఈ 8 విడతలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే 9వ విడత నగదును పంపిణి చేయనుంది.
అయితే భూరికార్డులలో పేర్లు కనిపించే రైతుల కుటుంబాల సభ్యులందరి వివరాలతో కూడిన ఆధార్ లింక్డ్ ఎలక్ట్రానిక్ డేటాబేస్ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతోంది. ఇక ఇందులో రైతుల భూమి పరిమాణంతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అయితే ఇప్పటికీ మీరు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోలేదా ? నమోదు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ కావాలో తెలుసుకుందామా.
ఏఏ సర్టిఫికెట్స్ కావాలో తెలుసా.. 1. పేరు, వయసు, జెండర్, కెటగిరి (ఎస్సీ/ఎస్టీ) 2. ఆధార్ జీరాక్స్.. ఆధార్ నంబర్ లేని వారు డ్రైవింగ్ లైసెన్స్, గుర్తింపు కార్డు ఇవ్వొచ్చు. 3. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్. 4. మొబైల్ నంబర్.
Astronomer: టాలెంట్ అంటే ఈ చిన్నారిదే.. 7 గ్రహశకలాలను కనిపెట్టి.. చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలిక..
Viral News: గంటలో పెళ్లి.. ఇంతలో పోలీసులు ఎంట్రీ.. ఎగిరి గంతేసిన వధువు.. అసలేం జరిగిందంటే?