AP Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు..

Weather Inference for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిండగా.. నదులు ఉధృతంగా

AP Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు..
AP Rains
Follow us

|

Updated on: Jul 28, 2021 | 4:42 PM

Weather Inference for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులు నిండగా.. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి తెలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కోస్తా బంగ్లాదేశ్ మరియు దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో తీవ్రంగా మారిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మిడ్ ట్రోపో స్పియరిక్ లెవెల్స్ వరకు విస్తరించి కొనసాగుతోంది. రాగల 48 గంటలలో ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశలో కదులుతూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మరియు బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు.. ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాం: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దక్షిణ కోస్తా ఆంధ్రా: ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Also Read:

TTD : రూ. 300 దర్శన టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ.. రోజుకు 3 వేల టిక్కెట్లు. ఇలా బుక్ చేసుకోండి..

AP CM YS Jagan: కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష.. ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు..!