Marine Srinivas: మిస్టరిగా మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..
ఆయన ఒక గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించాడు. కుటుంబంలో, బంధువుల్లో, సమాజంలో మంచిపేరు తెచ్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మిస్ అయ్యాడు. కనిపించకుండా పోయి 2 నెలలు దాటింది. ఇప్పటికీ....
ఆయన ఒక గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించాడు. కుటుంబంలో, బంధువుల్లో, సమాజంలో మంచిపేరు తెచ్చుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మిస్ అయ్యాడు. కనిపించకుండా పోయి 2 నెలలు దాటింది. ఇప్పటికీ ఆ ఉద్యోగి ఆచూకీ లభించలేదు. గుంటూరుకు చెందిన మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. చెన్నైలోని సీనర్జీ మారిటైమ్ కంపెనీలో సెయిలర్‌గా పనిచేసేవారు శ్రీనివాస్. అయితే, మే 24 నుంచి శ్రీనివాస్ కనిపించడంలేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైజాగ్‌కు చెందిన ఓ యువతితో శ్రీనివాస్‌కు కొంతకాలంగా పరిచయం ఉందని, ఆమెకో టచ్‌లో ఉన్నాడని ఆరోపిస్తున్నారు. ఆ యువతితోపాటు శ్రీనివాస్ మిత్రుడు రాజేంద్రకు ఆచూకీ గురించి తెలుసని శ్రీనివాస్ కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించామని వివరించారు.
అయితే, సముద్రంలో ఉన్నప్పుడు మిస్ అయ్యాడు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోవైపు అతను పనిచేసిన కంపెనీ కూడా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపింది. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శ్రీనివాస్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. అటు పోలీసులు, ఇటు ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగి కాళ్ల అరిగిపోయాయని, కానీ ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ కుటుంబసభ్యులు.
అయితే, శ్రీనివాస్ మిస్సింగ్‌పై ఆ వైజాగ్ యువతి అతని కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం, పెళ్లి కావాల్సిన తమవాడు కనిపించకుండా పోవడం, రెండు నెలలైనా ఎలాంటి సమాచారం లేకపోవడంతో శ్రీనివాస్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసులు, నేతలు స్పందించి శ్రీనివాస్ ఆచూకీ కనుగొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులకు తమవద్ద సమాచారం ఇచ్చామని చెబుతున్నారు.