AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Update: చివరి దశకు చేరుకున్న షూటింగ్‌.. కాకినాడ బయలు దేరనున్న చిరంజీవి, సోనూసూద్‌.. ఐదు రోజుల పాటు అక్కడే..

Acharya Update: మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 'ఆచార్య' షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సైరా నర్సింహా రెడ్డి సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత...

Acharya Update: చివరి దశకు చేరుకున్న షూటింగ్‌.. కాకినాడ బయలు దేరనున్న చిరంజీవి, సోనూసూద్‌.. ఐదు రోజుల పాటు అక్కడే..
Achrya Shooting Update
Narender Vaitla
|

Updated on: Jul 29, 2021 | 8:44 AM

Share

Acharya Update: మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘ఆచార్య’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సైరా నర్సింహా రెడ్డి సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ బాగా పెరిగింది. అందులోనూ అపజయం అంటూ ఎరగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలు ఈ సినిమా చుట్టూ నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే కొరటాల చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తై విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే కరోనా నిబంధనలు సడలించిన తర్వాత మళ్లీ షూటింగ్‌ మొదలైంది. సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌ చివరి దశకు చేరింది. తాజాగా ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్లాన్ చేశారు మేకర్స్‌. ఇందుకోసం ఆచార్య టీమ్‌ లొకేషన్‌ను కాకినాడకు షిప్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఆచార్య సినిమా ఐదు రోజుల పాటు అక్కడే షూటింగ్‌ జరుపుకోనున్నట్లు టాక్‌. చిరంజీవి, సోనూసూద్‌ కాంబినేషన్‌లో కొన్ని సీన్స్‌ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా తర్వాత సోనూ ఇమేజ్‌ ఒక్కసారిగా మారడంతో ఈ సినిమాలో ఆయన పాత్రలో కొంతమేర మార్పులు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డేలు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్

Ram Gopal Varma : నీకింకా బుద్ధి రాలేదా.. హీరో సుమంత్ పై విరుచుకుపడిన వివాదాల వర్మ..

Actor Karthik: ‘సీతాకోకచిలక’ హీరో కార్తీక్‌కు తీవ్ర గాయాలు.. వ్యాయామం చేస్తున్న సమయంలో