Karthika Deepam: మిమ్మల్ని అద్నర్నీ నాశనం చేసేస్తాను..మోనిత శాపం.. ఏదైనా చేసుకో కార్తీక్ స్ట్రాంగ్ రిప్లై!
ప్రేమ పిచ్చిగా మారితే.. తాను ప్రేమించినవాడికి పెళ్లి అయిపోయిందని తెలిసినా అతనే కావాలని ప్రయత్నాలు చేస్తే.. మంచి స్నేహితురాలిని నమ్మిన అతనిని మోసం చేసి.. అతని కాపురంలో చిచ్చుపెట్టి ఎలాగైనా తనని పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంది?
Karthika Deepam: ప్రేమ పిచ్చిగా మారితే.. తాను ప్రేమించినవాడికి పెళ్లి అయిపోయిందని తెలిసినా అతనే కావాలని ప్రయత్నాలు చేస్తే.. మంచి స్నేహితురాలిని నమ్మిన అతనిని మోసం చేసి.. అతని కాపురంలో చిచ్చుపెట్టి ఎలాగైనా తనని పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంది? ఒక పిచ్చెక్కిన ప్రేమకి.. మూడుముళ్ల బంధంలో గొప్పతనానికి మధ్య జరుగుతున్న సంఘర్షణకు దృశ్యరూపం కార్తీకదీపం. బుల్లితెరపై తిరుగులేని ఆధిక్యంతో.. అత్యధిక ప్రజాదరణతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ప్రతిరోజూ ఎన్నో మలుపులు. నిత్యం కొత్త కథనం తో అందరినీ అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ కు అక్షర రూపం ఇది. ఇప్పటివరకూ ఏమైందంటే.. కార్తీక్ ను పెళ్ళిచేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయిన మోనితను దీప గట్టిగా అడ్డుకుంటోంది. మోనిత గతంలో చేసిన పాపాలను వెలికి తీస్తూ ఆమెను దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఏమి చేయాలో పాలుపోని మోనిత కార్తీక్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని విశ్వప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆమె విషం తాగుతాను అంటూ బెదిరిస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన దీప ఆమెను అడ్డుకుని.. నువ్వు ఎందుకు తాగడం నేనే విషం తాగుతాను అంటూ విషం నీళ్ల బాటిల్ తీసుకుని గటగటా తాగేస్తుంది. కార్తెక్ అందరూ ఆపడానికి ప్రయత్నించినా ఆగదు. అయితే దీపకు ఏమీకాదు. దీంతో దీప మోనితను ఎంతకాలం ఇలా బెదిరిస్తావు? అంటూ గట్టిగా మందలిస్తుంది. తన బండారం బయటపడిపోవడంతో షాక్ అయినా మోనిత దీప కాళ్ళమీద పడిపోతుంది. తరువాత కార్తీక్ ను నన్ను నువ్వు ప్రేమించలేదా? అని అడుగుతుంది. దానికి కార్తీక్ కచ్చితంగా లేదు అని సమాధానం చెబుతాడు. అందరు స్నేహితుల్లానే నిన్నూ చూశాను అంటూ చెబుతాడు.. ఇదీ నిన్నటి ఎపిసోడ్ (1102)లో జరిగిన కథ. మరి ఈరోజు ఎపిసోడ్ (1103)లో ఏం జరగబోతోంది? తెలుసుకుందాం..
నువ్వు పీకకోసుకున్నా సరే డోంట్ కేర్!
తన బెదిరింపులు పారకపోవడం.. కార్తీక్ తాను ప్రేమించడం లేదని కచ్చితంగా చెప్పడంతో.. మోనిత పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. మన పెళ్లికోసం సూట్ తీసుకున్నాను.. ఈ ఉంగరం కొన్నాను.. ఇన్ని చేస్తే మన పెళ్లి జరగదని చెబుతావా? ఎలా జరగదు? ఈనెల 25వ తేదీన ఎటువంటి పరిస్థితిలోనూ పెళ్లి జరగాల్సిందే అంటుంది. దీపతో అక్కా.. వంటలక్కా.. కార్తీక్ అంటే నాకు పిచ్చి ప్రేమ. నా పెళ్లి ఆపకు. అంటూ బ్రతిమిలాడుతుంది. తరువాత కార్తీక్ తో మోనిత నన్ను ప్రేమించకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. అని మోనిత అంటుంది. దానికి కార్తీక్ ” నాకు ఉంది. నన్ను ప్రేమించవద్దు అని చెప్పే హక్కు నాకు ఉంది” అంటాడు. దీంతో మోనిత ”ఇలా మాట్లాడుతాడు ఏమిటి? నా గర్భం గురించి ఏమంటాడు? ఇంతచేసి ఇలా మాట్లాడతాడు ఏమిటి? అంటుంది. దానికి కార్తీక్ ”అది నాకు తెలియక జరిగింది కాబట్టి నా తప్పు లేదు. నీకు తెలిసి జరిగింది కాబట్టి ఇది నీ తప్పే.” అంటాడు. దీంతో మోనిత నాకు సంబంధం లేదు అంటే నేను ఊరుకుంటానా? అని మోనిత బెదిరింపులకు దిగుతుంది. దీంతో కార్తీక్ ”ఏం చేస్తావ్? మళ్ళీ వెళ్లి చెయ్యికోసుకుంటావా? నువ్వు పీక కోసుకున్నా కూడా డోంట్ కేర్. ఏం చేసుకుంటావో చేసుకో.” అంటాడు. ఆ మాటతో హతాశురాలైన మోనిత ఏడుపు అందుకుంటుంది. ” ఈ మాట ఎలా అంటావు కార్తీక్? నీ భార్య నువ్వు అనుమానించవని దూరంగా వెళ్ళిపోయింది. నేను మీ వాళ్ళు కొట్టినా.. అందరూ ఎలా మాట్లాడినా నీతోనే ఉన్నాను. పదహారేళ్లు ఏ మగాడిని దగ్గరకు రానీయకుండా నేను నీకోసమే బ్రతికాను. నాది ప్రేమ మాత్రమే కాదు త్యాగం కూడా.” అని అంటుంది. ”నిన్ను ఏమడిగాను కార్తీక్. ఆస్తులు అడిగానా? కేవలం ఒక పసుపుతాడు కట్టమన్నాను. నాకులా ప్రేమించే దానిని వదులుకుంటే నీకు నష్టం. ఒక తాడు మేడలో కడితే ఆడది భార్య అవుతుంది. అదే తాడు చేతికి కడితే చెల్లి అవుతుంది. బంధాల్ని తాడు నిర్ణయించడం ఏమిటి కార్తీక్.. మనసు ముఖ్యం.” అంటూ కార్తీక్ ను అడుగుతుంది.
కడవరకూ భార్యను..భర్తను ప్రేమ బంధంలో ఉంచేది తాళి!
దీపా.. నువ్వైనా చెప్పు.. నా తలరాతని మార్చమని చెప్పు అంటూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ అడుగుతుంది. దీంతో దీప ”ఆగవే.. ఎందుకు ఇలా ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నావు? దీనిని ప్రేమ అనరు. ప్రేమ అంటే ఎదుటివారి మంచిని కోరుకునేది. నీలా కాదు. నీది ప్రేమ కాదు ద్వేషం..పగ..పైశాచికత్వం..ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదల. అంతే తప్ప నీలోప్రేమలేదు. నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే..ఆయన కుటుంబాన్ని వీధిలోకి లాగాలని ప్రయత్నించవు. నా స్థానంలో నువ్వుంటే పదేళ్లు ఆయన కోసం ఎదురుచూసేదానివా? ఎంత అరాచకం సృష్టించేదానివి?నువ్వు ఆలోచించాల్సింది నీ ప్రవర్తన గురించి. నువ్వు అందని దానికోసం ఆరాటపడుతుంటే.. నీ కోసం అన్నీ ఇచ్చేయడానికి ఎవరూ సిద్ధగా లేరిక్కడ. నువ్వు అన్నావు తాడు శాసించడం ఏమిటి అని.. ఈ తాడు మూడుముళ్ల బంధం. ఈ తాడు కడవరకూ భార్యని, భర్తని ప్రేమ అనే చట్రంలో బిగించేది. ఈతాడును త్యాగం చేయడానికి ఏ ఆడది సిద్ధం కాదు. ఇక చాలు..ఆపు. నీ ఉన్మాదాన్ని భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఇక్కడ.” అంటుంది. తరువాత దీప కార్తీక్ ను డాక్టర్ బాబూ మీరు బయటకు వెళ్ళండి. అంటుంది. దీంతో కార్తీక్ బయటకు వెళతాడు. డిమోనిత కార్తీక్ ను ఆపడానికి పరాయత్నించినా ఆగడు. దీంతో మోనిత పట్టరాని ఆవేశంతో వెళ్ళు..మీ అందరి అంతూ చూస్తాను..మీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. అంటూ శాపనార్ధాలు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మోనిత తప్పులు ఆమెను కాల్చేయడం మొదలైంది!
కార్తీక్ దిగాలుగా కూర్చుని ఉంటాడు. దీప వచ్చి డాక్టర్ బాబు ఎందుకు అలా ఉన్నారు అని అంటుంది. ”ఎం చేయాలి దీపా అందరిలోనూ నేను తలదించుకోవాల్సి వస్తోంది. సారీ దీపా అంటాడు.” సారీ ఎందుకు? అని అడుగుతుంది దీప. దాంతో ఇటువంటి పరిస్థితి ఏ భార్యకు రాకూడదు. అంటూ చేతులెత్తి దణ్ణం పెడుతాడు. మోనిత తప్పు దానిని కాల్చేయడం మొదలైంది డాక్టర్ బాబూ.. మీరు భోంచేస్తే నేను పిన్నీ వెళ్ళిపోతాం అంటుంది. ఆ మాటతో కార్తీక్ భోజనానికి వెళతాడు. తరువాత భాగ్యం దీప ఇంటికి వెళతారు. తరువాత కార్తీక్ తండ్రి ఉన్న గది వద్దకు వెళతాడు. అక్కడ ఉన్న డాక్టర్ ని బయటకు పిలుస్తాడు. తండ్రి రిపోర్టులు చూస్తాడు. అంతా నార్మల్ గా ఉందికదా. రేవు నేను ఆయన్ని ఇంటికి తీసుకెళతాను అంటాడు. దానికి ఆ డాక్టర్ నువ్వా? అని అడుగుతాడు. ఆయనకి పూర్తిగా నయం అయ్యే వరకూ జాగ్రత్తగా ఉండు. అని చెబుతాడు. అలాగే అని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు.
నీ పాత కథల లెక్కలు తేలుతాయి..
మోనిత ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. ఈలోపు దీప అక్కడికి వస్తుంది. దీపను చూసి షాక్ అవుతుంది మోనిత. ఈలోపు డీఎస్పీ రోషిణి మోనితకు ఫోన్ చేస్తుంది. అది చూసిన మోనిత ఫోన్ లిఫ్ట్ చేయడానికి తటపటాయిస్తూ ఉంటుంది. అప్పుడు దీప డీఎస్పీ ఫోన్ చేస్తే అలా ఆలోచిస్తావే? మాట్లాడు అంటుంది. దీంతో మోనిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎంతసేపు? నీకోసం కూడా నేను ఎదురుచూడాలా? అంటూ రోషిణి చిరాకు పడుతుంది. వస్తున్నా మేడం అని సమాధానం ఇస్తుంది మోనిత. మోనిత దీపము చూసి నేను రోషిణి మేడం దగ్గరకు వెళుతున్నాను. అక్కడ మీ సంగతి తెలుస్తాను అంటూ వెళ్లబోతుంది. ఆమెను దీప అపి.. ”వెళ్తున్నాను.. కాదు వెళదాం. అక్కడ అంజి ఉన్నాడో.. మరెవరైనా ఉన్నారో? నీ పాత కథలు ఏమి చెప్పారో.. కొత్త కథనాల గురించి మేడం కి ఏమి తెలిసిందో? అన్నీ తేల్చుకుందాం” అంటుంది.. ఈ సన్నివేశాలు రేపటి ఎపిసోడ్ (1104)లో చూడాల్సిందే!
Also Read: Karthika Deepam Serial: విషం తాగిన దీప.. పిచ్చెక్కిన మోనిత..నోరు విప్పిన కార్తీక్.. సూపర్ సీన్!