Rajeev Kanakala: సుమతో విభేదాల రూమర్స్‏కు చెక్ పెట్టిన రాజీవ్ కనకాల.. నిజంగానే విడిగా ఉండాల్సి వచ్చిందంటూ..

బుల్లితెరపై తన మాట తీరుతో,  యాంకరింగ్‍లో టాప్ ప్లేస్‏లో దూసుకుపోతుంది సుమ కనకాల. అటు వెండితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు రాజీవ్ కనకాల..

Rajeev Kanakala: సుమతో విభేదాల రూమర్స్‏కు చెక్ పెట్టిన రాజీవ్ కనకాల.. నిజంగానే విడిగా ఉండాల్సి వచ్చిందంటూ..
Rajeev
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 27, 2021 | 2:53 PM

బుల్లితెరపై తన మాట తీరుతో,  యాంకరింగ్‍లో టాప్ ప్లేస్‏లో దూసుకుపోతుంది సుమ కనకాల. అటు వెండితెరపై తన నటనతో ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు రాజీవ్ కనకాల.. ఇద్దరూ ఎవరి కెరీర్‏లో వారు బిజీగా గడిపేస్తున్నారు. 1999లో వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రోషన్, మనస్వీని అనే కొడుకు, కూతురు ఉన్నారు. అయితే పాతికేళ్ల వివాహం బంధంలో ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. విడి విడిగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‏పై వీరిద్దరు గతంలో స్పందించి క్లారిటీ కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి విడాకుల రూమర్స్ పై స్పందించారు.

Rajeev Kanakala

Rajeev Kanakala

చాలా గ్యాప్ తర్వాత రాజీవ్ కనకాల మళ్లీ తెరపై కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన నారప్ప సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన రాజీవ్.. తాజాగా ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే సుమతో తనతో గొడవలు.. విడాకుల రూమర్స్ పై స్పందించారు. సుమకు తనకు విబేధాలు లేవని చెప్పుకొచ్చారు. అమ్మ చనిపోయినప్పుడు నాన్న ఒక్కడే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. తనని మా ఫ్లాట్‎కు షిఫ్ట్ చేయాలనుకున్నాం. కానీ తన పుస్తకాల లైబ్రరీ చాలా పెద్దది. దీంతో తనను మా ఇంటికి షిఫ్ట్ చేయలేక.. నేనే తన దగ్గర ఉండేవాడిని. అలా నేను సుమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేకానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. అలాగే తమ మధ్య ఎప్పుడూ డబ్బుల విషయంలో మనస్పర్థలు రాలేవని తెలిపారు. సుమ తన యాంకరింగ్‏లో సంపాదిస్తుంది.. సినిమాలలో నాకు వస్తుంది. అంతేకానీ ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెప్పుకొచ్చారు.

Also Read: Raj kundra: రాజ్ కుంద్రా కంపెనీపై గుజరాత్ షాప్ కీపర్ చీటింగ్ కేసు.. రూ. 3 లక్షలు నొక్కేశాడట !

Yashika Anand: ఓ వైపు యాషికా ఆనంద్‌కు రెండు ఆపరేషన్ల నిర్వహణ.. మరోవైపు డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు నమోదు