Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashika Anand: ఓ వైపు యాషికా ఆనంద్‌కు రెండు ఆపరేషన్ల నిర్వహణ.. మరోవైపు డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు నమోదు

Yashika Anand: యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్న హీరోయిన్ , బిగ్‌బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ కు సోమవారం రెండు ఆపరేషన్లు నిర్వహించారు.

Yashika Anand:  ఓ వైపు యాషికా ఆనంద్‌కు రెండు ఆపరేషన్ల నిర్వహణ.. మరోవైపు డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు నమోదు
Yashika Anand
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2021 | 12:47 PM

Yashika Anand: యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్న హీరోయిన్ , బిగ్‌బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ కు సోమవారం రెండు ఆపరేషన్లు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి మహాబలిపురం వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్ నగరంలో ఓ కార్పొరేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో యాషికా ఆనంద్ కాలు, నడుం భాగం వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వాటిని సరిచేసేందుకు సోమవారం ఆపరేషన్లు చేశారు. ప్రస్తుతం యాషికా ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని.. పదిరోజులైనా ఆస్పత్రిలోనే ఉంది చికిత్స తీసుకోవాల్సి ఉందని వైద్యులు చెప్పారు. అంతేకాదు యాషికా పూర్తిగా కోలుకోవాలంటే దాదాపు ఆరునెలలలైనా పడుతుందని చెప్పారు.

మహాబలిపురం నుండి చెన్నై వస్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంగా కారు నడిపి డివైడర్‌ని ఢీ కొట్టడమే ప్రమాదానికి కారణంమని.. కారు లో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం సేవించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో యాషికా ఆనంద్‌ లైసెన్సును మహాబలిపురం పోలీసులు రద్దు చేశారు. అంతేకాదు యాషికా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించాలని నిర్ణయించారు. ఈ ప్రమాదానికి సంబంధించి యాషికా, ఆమె ఇద్దరు స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే. కాగా, శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో యాషిక ఆనంద్ స్నేహితురాలు వల్లిశెట్టి భవానీ స్థలం వద్దనే మృతి చెందింది. మరో  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఢిల్లీలో పుట్టి… చెన్నైలో స్థిరపడిన యాషికా ఆనంద్ ప్రస్తుతం తమిళంలోని ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా పలు రియాలిటీ షోల్లో కూడా పాల్గొని ఫేమస్ అయ్యింది. ఆనంఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ నటి… 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌తో ఆరంగెట్రం చేసింది 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో కోలీవుడ్ లో అడుగు పెట్టి.. బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్‌లో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read: MAA Elections: ‘మా’ ఎన్నికల్లో కృష్ణంరాజు ఎంట్రీ .. కరోనా థర్డ్‌వేవ్ లేకపోతే సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ ?..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్